Headlines

నవభారత నిర్మాణం! కేసిఆర్‌ తోనే సాధ్యం. 

`దేశంలో కొత్త జాతీయ పార్టీ చారిత్రక అవసరం.

`కేసిఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చారిత్రాత్మక నిర్ణయం.

` కేసిఆర్‌ ప్రతి అడుగు ఒక సందేశం…

`ప్రతి వ్యాఖ్య ఒక సంకేతం…`చూపే దారి అనుసరనీయం…

`భవిష్యత్తు నిర్ధేశనం…

`నాడు రాష్ట్ర సాధన…నేడు దేశ సమారాధన.

`తెలంగాణ వెలుగులు…దేశమంతా కాంతులు…

`పచ్చని సోయగాలు.. పసిడి పంటలు.

`తెలంగాణ జల కళలు…దేశమంతా పారే సెలయేర్లు…

`రైతు సుభిక్షం…దేశం సుసంపన్నం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక వ్యక్తి ఆలోచన ఓ తరానికి ఆలంబన. ఒక వ్యక్తి ఆచరణ కొన్ని తరాలకు అనుసరణ. ఒక వ్యక్తి తలపు రేపటికి ఆరంభం. ఒక వ్యక్తి మలుపు కొత్త తరానికి ముందుగుడు. ఒక వ్యక్తి రాజకీయం దేశ వికాసానికి అవసరం. ఒక వ్యక్తి పట్టుదల సమాజాభివృద్ధి పయనం. ఒక వ్యక్తి లక్ష్యం దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం. ఒక వ్యక్తి గమ్యం అన్ని తరాలకు ఆదర్శం. ఇవన్నీ ఒకే వ్యక్తిలో వుంటే…ఆయన మార్గదర్శిగా అడుగులేస్తుంటే…సమాజమంతా ఆయన వైపే చూస్తుంటే…ఆయన అడుగులో జనమంతా అడుగులు వేయాలనుకుంటుంటే అది రాజనీతిజ్ఞడు కేసిఆర్‌ అవుతాడు…ఉద్యమ కారుడుగా లక్షలాది మంది కేసిఆర్‌లను తయారు చేసిన సూర్తి ప్రధాత…తెలంగాణ సాధకుడు…బంగారు తెలంగాణ నిర్మాత…రేపటి భావి భారత నిర్మాణ అవుతాడు కొనియాడబడుతున్నాడు…ఇది జనం మదిలోని మాట…జనం చర్చించుకుంటున్న ముచ్చట. పల్లెల్లో నీటి పరవళ్లు కళ్లముందు కదలాడుతుంటే, పాలమూరు కూడా మురిసిపోతూ పరుచుకున్న పచ్చని పైట…జై కేసిఆర్‌ అంటూ దుంకుతున్న నీటి మూట…ఒడిసిపట్టుకొట్టకొన్న నీటి అలలను ముద్దాడుతున్న రిజార్వాయర్ల సొగుసు బాట. తలమానికమైన ప్రగతికి పూదోట….బంగారు తెలంగాణ అని పాడుకుంటున్న కవి గాయకులు కమ్మని కలల కలాలు, గొంతులు దాటి పొంగుతున్న తేలేరూరే పాట…తెలంగాణ ఇంట సిరుల సింగారింపు పూటదోట. నిర్మలమైన, నిశ్చితమైన నిర్మాణాత్మక పయనం అంటే ఎవరైనా ఆహ్వానిస్తారు. 

అందుకు పట్టుదలకు మారుపేరైన నాయకుడు కేసిఆర్‌ అంటే అందురూ కదులుతారు. ఆయన మాటల్లో ప్రజల మాట వినిపిస్తుందని ఆసక్తిగా వింటారు….అందుకే ప్రజలు సుఖసంతోషాలతో గడపాలన్నదే కేసిఆర్‌ కోరిక. ఇలా ప్రగతిని సాధ్యం చేసేవారు ఒక్క తరంతో ఆడిపోరు…ఏ ఒక్క తరానికి వారి కీర్తి పరిమితం కాదు..తరతరాలు ఆ కీర్తి అజరామరమౌతుంది. రాముడెలా వుండేవారో ఎవరూ చూడలేదు. కాని రామరాజ్యం గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం…ఇంకా ఎన్ని యుగాలు చెప్పుకుంటారో చెప్పలేం…అశోకుడు చెట్లు నాటించేను అని ఇప్పటికీ చదువకుంటున్నాం…దేశంలో ఎప్పుడో క్రీశ.3 శతాబ్ధానికి పూర్వం జరిగిన విషయం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ..ప్రతీసారి స్పూర్తిని పొందుతూనే వున్నాం…అదే వర్తమానంలో మరో చారిత్రక నాయకత్వం ఉద్బవం మనం చూస్తున్నాం…కొన్ని తరాల మదిలో చిరస్ధాయిగా నిలిచిపోయే నాయకత్వంలో వున్నాం. అవును..ఇది కొందరు అంగీకరించకపోవచ్చు. కాని తన తరాన్ని తీర్చిదిద్ది ..మలితరానికి మార్గం వేసి, వచ్చే తరాలన్నీ సుఖసంతోషాలతో వర్ధిల్లేందుకు కొందరే పూనుకుంటారు… కొన్ని వందల ఏళ్ల అవసరమైన ప్రగతి దారులు వేస్తుంటారు…! అది ఇప్పుడు కేసిఆర్‌ సాధ్యం చేసి చూపిస్తున్నారు. తెలంగాణలో చెరువులు అంటే ఒకప్పుడు గుర్తుకువచ్చేది కాకతీయులు…ఇప్పుడు గుర్తుకొచ్చేది ముఖ్యమంత్రికేసిఆర్‌….ఎందుకంటే ఎండిన చెరువులకు కొన్ని శతాబ్ధాలుగా మరమ్మత్తులు లేవు. వాటికి ఆదరణ లేదు… అంతరించి కొన్ని, ఆనవాలు కోల్పోయి కొన్ని, ఆక్రమణలకు గురై కొన్ని, కుంచించుకొని కొన్ని, ఎండిపోయి కొన్ని, చుక్క నీరు నిలువలేక, నిండు కుండ చెప్పుకోవడానికి వీలు లేక, పడిన చుక్కను ఒడిసిపట్టలేని తుమ్మలు పెరిగిన చెరువులు తెలంగాణలో వుండేవి. కాని అవి నేడు నీళ్లతో కళకళలాడుతున్నాయి.

తెలంగాణలో 46వేలకు పై చిలుకు చెరువులు మళ్లీ పూర్వ వైభవం పొందాయి….అందుకు కారణం తెలంగాణ రావడం…కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం…అంతే…ఇది కాదని అనే ధైర్యం ఎవరికీ లేదు…ఎందుకంటే టిఆర్‌ఎస్‌ కాక మరే పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ చెరువుల బాగు చేద్దామని ఎవరూ అనుకొని వుండేవారు కాదు…కొట్లాడినా వాటిని పట్టించుకోకపోదురు…ఇది నిజం…ఇది తెలంగాణ పల్లె జనానికి తెలిసిన అక్షర సత్యం…అందుకే కేసిఆర్‌ నవయుగ వైళాలికుడు…అని చెప్పకతప్పదు. ఇక తెలంగాణలో పంటలు అన్నవి ఒకనాడు కన్నీటి కల…నిద్ర చెరిపే కల…ఉలిక్కిపడే కలతనిద్ర…! కాని నేడు నిజమైన పండుగ …కళ్లముందు ఆవిష్కరింపబడిన కేసిఆర్‌ కన్న కల…నిజం చేసిన వాస్తవం…ఒక అధ్భుత దృష్యం…! సాధ్యం కానిదాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేసిఆర్‌…తెలంగాణ వస్తుందని ఎవరూ నమ్మలేదు…కేసిఆర్‌ను ముందు ఎవరూ విశ్వసించలేదు…స్వయంగా కేసిఆర్‌ స్నేహితులే… నమ్మకం లేని ప్రయాణం అంటూ పెదవి విరిచిన సందర్భం… కాని కేసిఆర్‌ అడుగు ఆగలేదు…పట్టుదల సడలలేదు…ఒక్కడుగా మొదలయ్యాడు..ఒక్కొ అడుగు వేస్తూ వచ్చాడు…కనీసం తన నీడైనా తనతో వస్తుందా? అని ప్రశ్నించి వారు సైతం జై తెలంగాణ అనక తప్పని స్దితి తెచ్చాడు…అలాంటి పరిస్ధితులు సృష్టించాడు…తెలంగాణ కల నిజం చేశాడు…తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిజం చేశాడు.. ఇప్పుడూ అదే అదే పట్టుదల…అదే కసి…అదే అడుగు బలంగా వేస్తున్నాడు…తెలంగాణ కోసం కేసిఆర్‌ తొలి అడుగు వేసినప్పుడు పుబ్బలో పుట్టి, మగలో మాయమయ్యేది అన్నారు…ఇప్పుడూ అలాగే అంటున్నారు…

కాకపోతే మధ్యలో సాధించిన తెలంగాణ కళ్లముందు కనిపిస్తుండడంతో కేసిఆర్‌ను గట్టిగా విభేధించడానికి ప్రతిపక్షాలకు మనసొప్పడం లేదు…ధైర్యం చాలడం లేదు… గండరగండడు కేసిఆర్‌…అనుకున్నది సాధించినా సాధిస్తాడు అన్న నమ్మకం చాలా మందిలో వుంది. పైకి ఎన్ని విమర్శలు చేస్తున్నా… కేసిఆర్‌ జాతీయ పార్టీ సక్సెస్‌ చేస్తాడన్న వారే ఎక్కువగా కనిపిస్తారు…కేసిఆర్‌తో విభేదించేవారు కూడా తొందరపడి మాట్లాడితే బోల్తా పడతామో! అని ఆలోచించి మాట్లాడుతున్నారు…! ఇప్పటి తరానికి తెలిసిన కేసిఆర్‌ వేరు…నిన్నటి తరానికి తెలిసిన కేసిఆర్‌ వేరు…ఎందుకంటే ఏదైనా అధ్యయనం కేసిఆర్‌ మొదలుపెడితే…దాన్ని ఆచరణ రూపంలోకి తెచ్చేదాకా వదలరు…అన్నది బలంగా అందరూ నమ్ముతారు…అందుకే తెలంగాణ కోసం గట్టిగా ఆయన మాట్లాడిన నాడు ఆయనకు ఎదురు చెప్పడానికి కూడా ముందుకు రాలేదు… అందరూ ఆయన బాటలోనే నడిచారు…అందరూ కలిసి తెలంగాణ కోసం గళమెత్తారు..ఉద్యమంలో కలిసి వచ్చారు…పోరాటానికి వెనుకాడలేదు…ఇప్పుడుకూడా అంతే…ముందు కొంత సంశయం వ్యక్తం చేసిన వివిధ రాష్ట్రాల నాయకులు కూడా, ఇప్పుడు కేసిఆర్‌ చెబుతున్న మాటలు…వారిని ఆలోచనల్లో పడ్డారు….అందుకే కలిసి వచ్చేందుకు సై అంటున్నారు…దసరా రోజు తెలంగాణకు వచ్చేందుకు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు రెడీ అవుతున్నారు.. ఈ మధ్య తమిళనాడుకు వెళ్లిన జర్నలిస్టుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలే దేశమంతా వినిపిస్తున్నాయి…

ముఖ్యమంత్రి కేసిఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అంటూ స్టాలిన్‌ చేసిన ప్రశంస ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. తెలంగాణ వైపు దేశమంతా చూస్తోంది…తెలంగాణ ప్రగతిని కొనియాడుతోంది…మాకు అలాంటి నేత వుంటే బాగుండు అని ప్రతి రాష్ట్రం తపిస్తోంది…ఆయన నాయకత్వంలో దేశమే వుంటే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నారు… దేశం బాగుపడుతుందని కోరుకుంటున్నారు… దేశంలోని అనేక రాష్ట్రాలలోని రైతులు తెలంగాణ రాష్ట్రంలో అనతి కాలంలో జరిగిన అభివృద్ధి, రైతులకు అందుతున్న సంక్షేమ పధకాలు, ఇరవై నాలుగు గంటల విద్యుత్‌, రైతు బంధు, రైతు రుణ మాఫీ, రైతు భీమా ఎంతగానే ఆకర్షిస్తున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల రైతులు ఒక రాష్ట్రానికి వచ్చి, అమలౌతున్న విధానాలు అధ్యయనం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోని 26 రాష్ట్రాల రైతులు ఏక కాలంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసి, ఇక్కడి పరిస్ధితులు అడిగి మరీ తెలుసుకొని, ఆయా రాష్ట్రాలలో కూడా తెలంగాణ పధకాలు కావాలని కోరుకోవడం అంటేనే తెలంగాణ విజయం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద వారికి ఎంత నమ్మకం వుందో తెలుసుకోవచ్చు. దేశమంతా సస్యశ్యామలమే కేసిఆర్‌ కోరుకునేది…రైతులంతా ఆహ్వానించేది…దేశం సుభిక్షంగా వుండాలంటే ముందురైతు సంతోషంగా వుండాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వమే దేశానికి కావాలి. ప్రజలంతా కోరుకుంటున్నది కేసిఆర్‌ రావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *