చైతన్య కార్యక్రమాల్లో జోగినపల్లి మరో ప్రత్యేకత

కరోనా నియంత్రణకు సరికొత్త సందేశం
ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ మరో కార్యక్రమం
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మరో వినూత్న ప్రయత్నం చేశారు. ఓ భారీ టేకు ఆకుపై కరోనా నియంత్రణ చిత్రాలను, సందేశాన్ని పెట్టి ప్రచారంలోకి తెచ్చారు.

ఈ కొత్త తరహా ప్రయత్నంలో భాగంగా ఒక టేకు ఆకుపై తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం, అలాగే తప్పని సరిగా మాస్క్‌ను ధరించండి అనే నినాదాన్ని జత చేశారు.ప్రకృతి సిద్దమైన టేకు ఆకుపై అత్యంత ఆకర్షణీయంగా ఈ సందేశాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకత. కోవిడ్‌-19నియంత్రణ కోసం అందరూ కలిసి రావాలని, ముప్పు ఇంకా పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించడంతో పాటు బయటి కి వెళ్లినప్పుడు భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.
ఈ నియంత్ర చర్యల ద్వారానే కరోనాను నివారించగలమని చెప్పారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఈ సందేశంతో కూడిన ఫోటోలతో పాటు ఒక వీడియో చిత్రాన్ని కూడా ఆయన తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. సంతోష్‌కుమార్‌ చేసిన ఈ వినూత్న ప్రయత్నం సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యింది

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *