కమర్షియల్ నిర్మాణాల్లో ‘గోల్ మాల్’

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలే*
*అనుమతుల్లో జిడబ్ల్యుఎంసి అధికారుల చేతివాటం*
*ప్లానింగ్ కు సంబంధం లేకుండా నిర్మాణాలు*
*అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే అధికం*
*తిమ్మిని బమ్మి చేసి ప్రభుత్వానికి పంగనామం పెడుతున్న అధికారులు* *కళ్యాణ లక్ష్మి ఘటనలో అదుపులోకి రాని పరిస్థితులు*
*కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు*

నేటి ధాత్రి డెస్క్:నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిధుల ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో అధికారుల పనితీరు కూడా అంతకు మించి ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సార్యమౌతుండి. అధికారులు నిర్వహిస్తు విధులకు ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలను మించి ఆరించి అవినీతికి పాల్పడితే నగరం అభివృద్ధి కాగితాలకే తప్ప ప్రత్యక్షంగా జరగడం అసాధ్యమౌతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు వరంగల్ నగరాన్ని మెంటాడుతుం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి మొదలుకొని ప్రభుత్వ పెద్దల వరకు. రానున్న రోజుల్లో వరంగల్‌కు పెద్దసంఖ్యలో పరిశ్రమలు అభివృద్ధి సంస్థలు తరలో అమాశం ఉందని గంటాపథంగా చెబుతున్నప్పటికి ఆ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యలు తీసుకోలేక పోతున్నారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కేవలం అక్రమ మార్గంలో ధనార్జనే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతూ నగర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు.

 

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలు*

గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటి వరకు 3 లక్షల పైగా నిర్మాణాలు ఉండగా అందులో 2 లక్షల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం అయినదని నను ఉత్పల భవిష్యత్తును కాక్షించే కార్పోరేషన్ పెద్దలే చెబుతున్నారు. అంటే నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు జారీ చేసే విషయంలో కీలకంగా పని చేసే అధికారులు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో అర్ధమౌతున్నది. ఈ అక్రమ నిర్మాణాలు నగర అభివృద్ధికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. కేవలం తమ స్వార్థ కొరకు అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోకుండా తమ జేబులు నింపుకోవడానికి దిగజారుతున్న అధికారుల వలన వేల కోట్ల రూపాయల ప్రభుత్వం నష్టపోతున్నది. అంతేకాకుండా పన్నుల ఆదాయాన్ని కోల్పోయి నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగక కుంటుపడుతుంది.ఈ విషయం ప్రజలకంటే ప్రజా ప్రతినిధుల కంటే పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న అధికారులే ఈ అక్రమాలకు పాల్పడుతుండడం గమనార్హం

 

*ప్లానింగ్ కు సంబంధం లేని కట్టడాలు*

నగరంలో ప్రధానంగా కమర్షియల్ కట్టడాలకు సంబంధించి ఎలాంటి మునిసిపల్ నిబంధలనలు పాటించకుండా కట్టడాలు జరుగుతున్నారు. కేవలం నిర్మాణానికి సంబంధించిన మరుతలు రావడానికి కాగితాలను ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా తయారు చేయిస్తూ కట్టడాలు మాత్రం యజమానులు తమకు లాభదాయకంగా ఉండే విధంగా నిర్మించుకుంటున్నారు.

*పూర్తి కథనం ఈ రోజు మీ నేటిధాత్రిలో*

 

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *