ప్రజా పాలనతో ప్రతి గడపకు సంక్షేమం

ప్రజా పాలనతో ప్రతి గడపకు సంక్షేమం

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ వెల్లడి

నర్సంపేట, నేటిధాత్రి:

ప్రజా పాలనతో ప్రతి గడపకు రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతున్నదని
నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం హన్మకొండ హంటర్ రోడ్డులో నిర్వహించిన వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. వార్డు సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకే నేరుగా తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version