Vivekavardhini Students Shine in SSC Results
అద్భుత విజయకేతనం – శ్రీ వివేకవర్ధిని విద్యార్థుల ప్రతిభ
కేసముద్రం: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన బీరెల్లి ఓం సాయి 576 మార్కులు సాధించి మండల స్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అదేవిధంగా సముద్రాల లోకేష్ 564 మార్కులు, బొల్లు సాయి అక్షిత్ 561 మార్కులు, సముద్రాల రక్షిత 560 మార్కులు, కుంసోతు గౌతం 557 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.
ఈ ఏడాది పాఠశాల నుంచి మొత్తం 91 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 44 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం ఈ విజయానికి కారణమని పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్, ప్రిన్సిపల్ చిర్ర నరేష్ అభినందించి సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
