Two Women Missing in Sangareddy District
సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మహిళల అదృశ్యం..
జహీరాబాద్ నేటి దాత్రి:
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైన ఘటనలు కలకలం సృష్టించాయి. జహీరాబాద్ మండలం హోతి(బి) గ్రామానికి చెందిన షరీఫా బేగం ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శివ్వంపేట మండలం మగ్ధుంపూర్కు చెందిన మహేశ్వరి చర్చికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
