లైన్స్ 320 మల్టీ ఫుల్ ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి…
రామాయంపేట సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
లయన్స్ మల్టిపుల్ 320లో ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. రక్త, అవయవదానాలపై గత రెండున్నర దశాబ్దాలుగా అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసినందుకు ఈ గౌరవం దక్కిందన్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ కొంపల్లి కె.వి.ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర లయన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ సన్మానం జరిగింది. రాష్ట్రంలోని 320 ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ జిల్లాలకు చెందిన లయన్స్ సభ్యులలో ఉత్తమ సేవలందించిన వారిని అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ లయన్ హనుమండ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు రక్త, అవయవదానాలపై సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
లయన్స్ ఇండియా ప్రతినిధి లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ, సమాజంలో రక్తం, అవయవదానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సేవ అని పేర్కొన్నారు. లయన్స్ కానిస్టిట్యూషన్ ఏరియా లీడర్ లయన్ ఆర్. సునీల్ కుమార్ మాట్లాడుతూ, “లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఫిబ్రయిషీయో అలివేరా రూపొందించిన కార్యక్రమాలలో రక్త, అవయవదానం కూడా ప్రధాన అంశంని తెలిపారు.
లయన్స్ గవర్నర్ నగేష్ పంపాటి మాట్లాడుతూ, “320డి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం, అవయవదానం, శరీరదానానికి పలువురు ముందుకు వచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన గవర్నర్ లయన్ ఏ. అమర్నాథ్ రావు, జిల్లా మొదటి వైస్ గవర్నర్ లయన్ ఎం. విజయలక్ష్మి, రెండవ వైస్ గవర్నర్ లయన్ డి. నరసింహారాజు, పలు జిల్లాల గవర్నర్లు, మాజీ గవర్నర్లు, గ్యాట్ లీడర్లు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
రక్త, అవయవదానాల అవగాహనకు సహకరిస్తున్న పాత్రికేయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, రెడ్‌క్రాస్, లయన్స్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ గౌరవాన్ని అందుకున్నారు.