National Lineman Day Celebrated in Mogullapalli
వినియోగదారులకు విద్యుత్ సేవలందించడంలో లైన్మెన్ ల పాత్ర అత్యంత కీలకం
-మొగుళ్ళపల్లి విద్యుత్ ట్రాన్స్ కో ఇంచార్జీ ఏఈ సంజయ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సేవలు అందించడంలో లైన్మెన్ ల పాత్ర అత్యంత కీలకమని మొగుళ్ళపల్లి విద్యుత్ ట్రాన్స్ కో ఇంచార్జీ ఏఈ సంజయ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డీఈ పాపిరెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ట్రాన్స్ కో ఇంచార్జీ ఏఈ సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అంకితభావంతో పనిచేస్తున్న లైన్మెన్ లకు జాతీయ లైన్మెన్ దివాస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు, వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ సేవలందించేందుకు లైన్మెన్ ల పాత్ర ఎంతో కీలకమని, చలి, ఎండ, వాన కాలాలను లెక్క చేయకుండా..వినియోగదారులకు నిరంతర విద్యుత్ సేవలందించడమే వారు లక్ష్యంగా పనిచేస్తారన్నారు. అనంతరం లైన్మెన్ లను , ఏఎల్ఎంలను , ఆర్టిజన్ కార్మికులను , అన్ మ్యాన్డ్ కార్మికులను , స్పాట్ బిల్డర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ యాదగిరి, లైన్ ఇన్స్పెక్టర్లు గుగులోతు శ్రీనివాస్ నాయక్, దశరథం, లైన్మెన్లు మచ్చ సత్యం, రేణికుంట్ల శ్రీనివాస్, అనిల్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
