*పద్మావతి పరిచయ వేదికను విజయవంతం చేయండి..
తిరుపతి(నేటి ధాత్రి(ఆగస్టు 15:
రాయల్ బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, బి ఎం ఎస్ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఆదివారం రోజున స్థానిక గాంధీ రోడ్డు ఏ జీకే బిల్డింగ్ లో జరగనున్న పద్మావతి పరిచయ వేదికను విజయవంతం చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. స్థానిక
తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతీయ మజ్దూర్ సంగ్ జిల్లా అధ్యక్షులు ఆకుల సుబ్రహ్మణ్యం సతీష్ కుమార్ ఏ జీకే బిల్డింగ్ లో పద్మావతి పరిచయ వేదిక జరుగుతుందని అన్నారు. నివేదికలో బలిజ కులా
నికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యల విచ్చేసి వారి పెండ్లి కుమార్తె పెళ్లి కుమారుడకు తగిన సంబంధాలను చూసుకొని పెళ్లి సంబంధాలను కుదుర్చుకోవచ్చునన్నారు. తిరుపతి జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరైనా బలిజ సోదరులు సోదరీమణులు పాల్గొనవచ్చునని చెప్పారు. ఇందుకోసం పెండ్లి కుమారుడు కుమార్తె పోస్ట్ కార్డు సైజు ఫోటోలు బయోడేటాలను వారి తల్లిదండ్రులు వెంట తీసుకొని రావాలన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరిచయ వేదికకు బలిజ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బలిజ నేతలు గుట్ట నాగరాజు రాయల్, సుబ్బరామయ్య ఏవి ప్రతాప్ సాయి ప్రకాష్ కొండలరావు మనోజ్ దిలీప్ తదితరులు రాయలు బలిజ సంక్షేమ సంఘం చేస్తున్న కృషిని అభినందించడంతోపాటు వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారుమరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8712233082 ను సంప్రదించాలన్నారు.