ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండల తహసిల్దార్ కార్యాలయంలో పోలీసులు గౌరవ వందనం చేయగా తహసిల్దార్ రాణి జాతీయ పతాకావిష్కరణ చేశారు,నడికూడ జిపి యందు ఎంపీడీవో గజ్జెల విమల జాతీయ జెండాను ఆవిష్కరించారు,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు,మండల రైతు వేదిక ప్రాంగణంలో వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు, జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కే. హనుమంతరావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,పోలీసులు,పాఠశాల ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,అంగన్వాడీ టీచర్స్,ఆశా వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.