Toddy Tapper Dies in Tragic Fall
గాల్లోనే ఆరిపోతున్న గౌడన్నల జీవితాలు
-ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి నేరెళ్ల మొగిలి గౌడ్ మృతి
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
గాల్లోనే గౌడన్నల జీవితాలు ఆరిపోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన మొగిలి గౌడ్ (50) ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి పడి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పిడిసిల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వృత్తినే జీవనాధారంగా చేసుకొని కుటుంబ బారాలను వెల్లదీసుకుంటున్న గౌడన్నలు తాటి చెట్లపై నుండి పడి మృత్యువాత పడుతుండడంతో..గౌడన్నల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి..

గౌడన్నల జీవితాలకు భరోసాను కల్పించాలని, మృతి చెందిన నేరెళ్ల మొగిలి గౌడ్ కుటుంబం వీధిన పడకుండా రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గౌడన్నలకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాలని గౌడ సమాజం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
