LED Headlights Turning Night Travel Dangerous
కళ్ళు పోతున్నాయి
#నరకంగా మారిన రాత్రి ప్రయాణం
#ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లు
#సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు*
నేటి ధాత్రి,:
రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల LED లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయికొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు. నియంత్రణ జాడ ఎక్కడ లేదు.
గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది.. అసలు ఆ రూల్ వుందో తీసేసారో కూడా తెలియట్లేదు . ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక….కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న led లైట్స్ గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా.
