ఓడిన విడువని పట్టుదల,,,,,,
పట్టణం ప్రచారంలో… పట్టువదలని విక్రమార్కుడు,,,
, పేటలో బిజెపికి కేరాఫ్ అడ్రస్ శంకర్ గౌడ్,,,
, 55 శాతం బిజెపి మెజార్టీ కార్యకర్తల నిరంతర ప్రచారమే కారణం,,,,,
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి..
విశాల సముద్రంలో ఆణిముత్యంలా ప్రతి పార్టీకి సమూహానికి, సైన్యానికి ప్రతినిధి మార్గదర్శి లేకుంటే నిష్ఫలమవుతుంది. .అట్లే ఒకే ఒక్కడితోనే అతని సఫలీకృతం సాహసం కృషి పట్టుదల నిరంతర పోరాటం వల్ల సమూహానికి కానీ, పార్టీ కానీ, పేరు ప్రఖ్యాతులు విజయం వరిస్తుంది. .అందరూ వీరులుగా లేకున్నా ఒకే ఒక వీరుడు తన శక్తిని బలాన్ని నైపుణ్యాన్ని తన వారికి పంచడంతో ఆశక్తితోనే గెలుపు సాధ్యమవుతుంది. రామాయంపేట మండలంలోని పట్టణంలోనూ బిజెపి జాడ అంతంతమాత్రమే. రామాయంపేట నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి జనసంగు కానీ బిజెపి పుట్టిన తర్వాత కానీ స్వయం సేవకులు విశ్వహిందూ పరిషత్ ఉనికి, మాత్రమే ఉండి రాజకీయ పార్టీలోనే కొనసాగారు .టిడిపి బిజెపి అలయన్స్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు మాత్రం రామాయంపేట నియోజకవర్గంలో వాసిరెడ్డి మిత్రపక్షం బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. కానీ మళ్ళీ తెలుగుదేశం కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం జరిగింది. క్రింది స్థాయి నుంచి క్యాడర్ లేకపోవడం వారిని సమకూర్చుకొని పార్టీని బలోపేతం చేసిన ఆలోచన అప్పటి బిజెపి నాయకులు చేయకపోవడంతో అంతేగాక ఏదోక పార్టీకి సహకారంగా ఉంటూ బిజెపిని వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనంతరం రామాయంపేట పట్టణంలో కూడా బిజెపి తన బలాన్ని పెంచుకోవడానికి ఇక్కడ యువతరం నడుము కట్టింది .అస్తవ్యస్తంగా ఉన్న బిజెపి నాయకత్వానికి తమ యువ నాయకత్వం ఏబీవీపీ లాంటి సంస్థలను కూడా అభివృద్ధి చేసి యువకుల ఓట్లను అభివృద్ధి చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఒకే ఒక్కడు అతడు బిజెపి కేరాఫ్ గా శంకర్ గౌడ్ .తనదైన పట్టుదల ఏకాగ్రతతో అందర్నీ ఏకతాటిగా నడిపించడానికి ఎంతో కృషి చేశాడు. కార్యక్రమాలను ఆందోళన కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో వెనుకంజ వేయలేదు. ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో ముందుండి అరెస్టు కావడానికి పోలీస్ స్టేషన్లో తన పేరు నమోదు చేసుకోవడానికి ఎన్నడు వెనకాడ లేదు. ముఖ్యంగా బిజెపి పార్టీ తరఫున రెవెన్యూ డివిజన్ పోరాటంలో శంకర్ గౌడ్ ప్రముఖ పాత్ర వహించారు. ఆందోళన కార్యక్రమాల్లో ముందుండి పోలీసుల ఎదిరించి అరెస్టు కావడం కేసులను పెట్టించుకోవడం అతనికి ఆనవాయితీ. ముఖ్యంగా బీజేపీ పార్టీ నినాదాలతో మోడీ పేరుతో మాత్రమే ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడం జరుగుతుంది. కానీ శంకర్ గౌడ్ పట్టణంలోని కాకుండా మండలంలో అనేకమందికి పింఛన్ మరియు భూమి కేసులను పట్టణ సమస్యలు వాట్సాప్ లో మరియు సమస్యలు పూర్తయ్యే వరకు పోరాటం చేశాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ వార్డులో గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా అతని ఓడించే స్థితికి వచ్చాడు. కానీ పార్టీ నుండి కానీ పార్టీ సంఘం నాయకులు ఎవరు కూడా అతనికి అండగా ఉండకపోవడంతో ఓడిపోవడం జరిగింది .అది ఓటమి కాదని నిరంతర పోరాటానికి నాంది అనిపార్టీని పట్టణంలో పట్టణ అధ్యక్షులుగా ఉండి నడిపించడం ,ఈ పార్లమెంటు ఎన్నికల్లో మొట్టమొదట బిజెపి ప్రచార కార్యక్రమాలను ముందుండి నడిపించాడు .50 మంది కార్యకర్తలను నాయకులను మహిళ కార్యకర్తలను వెంటేసుకొని ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించడం వల్లనే రామాయంపేట పట్టణంలో బిజెపికి సగానికి పైగా మెజార్టీ తీసుకురావడం జరిగింది. కార్యకర్తలను నాయకులను జాగృతం చేస్తూ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపులో 5000 ఓట్లను అందించడంలో సఫలీకృతమయ్యాడు. అతనికి రామాయంపేట పట్టణమే కాకుండా మండలంలో కూడా ప్రభావం చూపింది .ఇలాంటి నాయకులకు పార్టీ కూడా సముచిత స్థానాన్ని అందించడం వల్ల ముందు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలను అందించి పార్టీకి అండదండగా ఉంటాడని ప్రజలు బిజెపి కార్యకర్తలు అనుకుంటున్నారు.