నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాగారం నేటిదాత్రి:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, సుమిత్ర సురేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ షఫీ, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.