అధిష్టానం వరకు ఇంకా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేరలేదా?
`సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతల్లో కలవరం?

`తెలంగాణా అస్థిస్తవాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం?
`తెలంగాణా లో టీడీపీ పెరిగితే కాంగ్రెస్ కు ఏం లాభం?
`సీఎం రేవంత్ మాటలు కాంగ్రెస్ కు మొదటికే మోసం?
`సీఎం వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్ ను బొంద పెట్టే ప్రయత్నం?
`టీడీపీ పెరిగితే బలపడేది దూసుకొచ్చేది తెలంగాణా లో బీజేపీ?
`బీజేపీ పెరిగితే కాంగ్రెస్ కు తెలంగాణా లో పూర్తిగా సమాదే?
`తెలంగాణా ఇచ్చిన, తెచ్చిన పార్టీగా ప్రజల్లో కాంగ్రెస్ కు గుర్తింపు వుంది?
`అందుకే ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించింది?
`తెలంగాణా లో ఏ ఒక్క నాయకుడిని చూసి ప్రజలు గెలిపించలేదు?
`సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చిన దేవత అని కాంగ్రెస్ ను గెలిపించారు?
`అధికారంలోకి వచింది కాంగ్రెస్ ను “బలి” చేయడానికేనా?
`కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎందుకు స్పందిచడం లేదు?
`మంత్రులు నోరెందుకు తెరవడం లేదు?
`తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ?
`ఏపీ లో మునిగినా త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ?
`తెలంగాణా లో టీడీపీ పెరిగితే కాంగ్రెస్ కు తీరని నష్టం?
`కాంగ్రెస్ లో కరడు గట్టిన తెలంగాణా ఉద్యమ కారుల మౌనం దేనికి సంకేతం?
`బీఆరఎస్ కతమైతే పెరగాల్సింది కాంగ్రెస్ పార్టీ?
`తెలంగాణా లో తిరుగు లేని శక్తి గా మారాల్సింది కాంగ్రెస్ పార్టీ?
`ఆ పని వదిలేసి రేవంత్ టీడీపీ కి పునాదులు పడాలని కోరుకోవడం ఏమిటి?
`సీఎం రేవంత్ రెడ్డి స్వయం ప్రకటిత విచిత్ర రాజకీయం.
`కాంగ్రెస్ నాయకులకు రాజకీయ సంకటం!
`మంత్రులు ఈ విషయం పై ఎందుకు మౌనం?
`ఇదేమిటని ప్రశ్నించ లేని మంత్రుల దైన్యం?
`పదవుల్లో ఉంటే చాలనుకుంటున్న దౌర్భాగ్యం?
`కరుడు కట్టిన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్న ఆవేశం?
`పదవుల్లో వున్న నాయకులు పట్టించుకోక పోవడం విడ్డూరం?
`కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెలసిన తెలుగుదేశం?
`కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేసింది తెలుగుదేశం?
`తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో సీఎం!
`కాంగ్రెస్ బలపడాల్సిన చోట తెలుగుదేశంకు సీఎం ఊతం
`బీఆర్ ఎస్ దిమ్మెలు కూల్చి కాంగ్రెస్ దిమ్మెలు కట్టాలని చెప్పాల్సిన సిఎం?
`తెలంగాణా లో టీడీపీ బలపడాలని సిఎం కోరుకోవడం విచిత్రం?
`ఇప్పటికీ రేవంత్ రెడ్డితో టీడీపీకి విడదీయలేని అనుబంధం?
`ఎన్టీఆర్ కు బీఆర్‌కు ఏం సంబంధం?
`ఎన్టీఆర్ ఆత్మ శాంతికి బీఆరఎస్ గద్దెలకు ఏమిటి వైచిత్యం?
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ నుంచి పారిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ జెండా తెలంగాణలో కోలుకోకుండా చేయాల్సిన బాధ్యత కల్గిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం సమాధి అవుతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చిన పార్టీకాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో బలంగా వున్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఓ రాష్ట్రంలో పార్టీనే త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్‌పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని పునాదులతో సహా పెలికిలించాల్సిన బాధ్యత తీసుకోవాలి. కాని తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఊపిరిపోయాలనుకోవడం కాంగ్రెస్‌కు సమాది కట్టడడమే అవుతుంది. ఏ రకంగా చూసినా ఒక రాష్ట్రంలో అంతర్ధానమైపోయి, మరో రాష్ట్రంలో కూడా లేకుండా పోవడం అంటే కాంగ్రెస్ పార్టీ త్యాగానికే అర్దం లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను చరిత్ర కూడా క్షమించదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలెరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం విడ్డూరం. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోతోంది. మరో వైపు బిజేపి పార్టీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను నరికేసుకుంటూ వస్తోంది. ఏకంగా తుడిచేస్తూ వస్తోంది. యాభై ఏళ్ల పాటు అప్రతిహాతంగా ఎదరులేని శక్తిగా నిలిచి, గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాలలో నూకలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసింది తెలంగాణ. జీవం నింపింది తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కత్పు్ఞత తెలిపిన ప్రజలు తెలంగాణ ప్రజలు. కొన ఊపిరిని సైతం నిజ ఊపిరిని చేసింది తెలంగాణ రాష్ట్రం. ఆ ఆశతో, ఆ ధైర్యంతో దేశమంతా మళ్లీ పుంజుకునేలా చేయాల్సిన బాద్యత కాంగ్రెస్ నాయకుల మీద వుంది. కాని తన పార్టీని వదిలేసి, తెలంగాణ వద్దన్న పార్టీకి పునాదులు తవ్వాలని సిఎం. రేవంత్ చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు వింటూ వుండడం విచిత్రంగా వుంది. తెలంగాణ కోసం బిఆరఎస్ కంటే ముందు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీకి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి, తెలంగాణ ఇవ్వాలని కోరింది కాంగ్రెస్ పార్టీ. అదీ కాంగ్రెస్ పార్టీకి వున్న గొప్పదనం. ఓ వైపు తెలంగాణ వద్దనే నాయకులు, మరో వైపు తెలంగాణ కావాలనే నాయకుల మధ్య పదేళ్లపాటు నలిగిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కరవమంటే కప్పకుకోపం, విడవమంటే పాముకు కోపంలా వున్నా, తెలంగాణను బతికించాలన్న సంకల్పంతో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు మరింత అన్యాయం జరగకుండా చూసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఎవ్వరూ మరో పార్టీ ఎదగాలని కోరుకోరు. మరోపార్టీకి ఆశ్రయం కల్పించాలని ఆలోచించరు. కాని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు తెలుగుదేశం జెండాలతో కార్యకర్తలు హజరౌవడం ఏమిటి? అని తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. పాలేరు నియోజకవర్గం ఏర్పాటై నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏనాడు గెలిచింది లేదు. పాలేరులో బలంగా వున్నది లేదు. అలాంటి పాలేరులో తెలుగుదేశం పార్టీ పెరగాలనికోరుకోవడంలో ఆంతర్యమేమిటో సిఎం. రేవంత్ రెడ్డే చెప్పాలని తెలంగాణ వాదులు అంటున్నారు. అయినా ఖమ్మం అంటేనే కాంగ్రెస్ కంచుకోట. ఆది నుంచి కాంగ్రెస్‌కు పూర్తి స్దాయిలో పట్టున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నప్ప్పుడైనా, తెలుగుదేశంపార్టీ అదికారంలోకి వచ్చినప్ప్పుడైనా కాంగ్రెస్‌దే పై చేయి. అయితే కాంగ్రెస్ లేకుంటే కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం. అలాంటి ఖమ్మంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడ ఏపార్టీకి అక్కడ తావులేదు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాదించింది. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన స్దానాలను గెల్చుకున్నది. 2023లో ఒక రకంగా స్వీప్ చేసింది. అలాంటప్ప్పుడు కాంగ్రెస్ మరింత పాతుకుపోయేలా చేయాలి. పునాదులు మరింత బలపడేలా చేయాలి. అదికారంలో వున్నందున ఖమ్మమంతా కాంగ్రెస్ మయం చేయాలి. ఇది కాంగ్రెస్ నాయకులు, పాలకులు చేయాల్సిన పని. అంతే కాని బిఆరఎస్‌ను బూచిగా చూపి, తెలుగుదేశం పార్టీకి ఊపిరిపోస్తే, కాంగ్రెస్‌కే తీరని నష్టమెదురౌతుంది. శత్రువుకు, శ్రత్రవు మిత్రుడు అనుకోవడం రాజకీయాల్లో సరైంది కాదు. తెలుగుదేశం, కాంగ్రెస్‌కు బిఆరఎస్ శత్రువనుకుంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు మిత్రుడు కాలేదు. ఈ చిన్న సూక్ష్మం కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా? తెలంగాణ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న నాయకులు కూడా కాంగ్రెస్‌లో వున్నారు. పదేళ్లపాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులు అనేక మంది వున్నారు. అందులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఒకప్ప్పుడు ఎంపిగా ఉద్యమం చేసిన ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి వున్నారు. తెలంగాణ కోసం తన రాజకీయాలను త్యాగం చేసిన మధుయాష్కీ గౌడ్ వున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ కురువద్దుడు వి. హనుమంతరావు వున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోఉప ముఖ్యమంత్రిగా వున్న దామోదర రాజనర్సింహ వున్నారు. ఇలా ఎంతో మంది సీనియర్ నాయకులు తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాహుల్ గాందీతో వున్న సాన్నిహిత్యంతో తెలంగాణ కోసం పోరాటం, ప్రయత్నం చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వున్నారు. కేవలం తెలంగాణ కోసం ఆనాడు మంత్రి పదవిని వదులుకొన్న ప్రస్తుత మంత్రి జూపల్లి కష్ణారావు వున్నారు. ఇంత మంది నాయకులు తెలంగాణలో ఇప్ప్పుడు తెలుగుదేశంపార్టీకి జీవిగంజి పోయాలనుకుంటున్నారా? సిఎం. రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారా? పరోక్షంగా మద్దతిస్తున్నారా? అయినా తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ మీద కోపంతో అన్నది నాయకులు మర్చిపోయారా? కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేసేదాకా విశ్రమించేది లేదని 1999 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు మాటలు మర్చిపోయారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలికితే పాతుకుపోయేది బిజేపి పార్టీ అనే సత్యం గ్రహించలేకపోతున్నారా? ఓ వైపు బిజేపి దేశమంతా కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుంటే, తెలంగాణలో చేజేతులా కాంగ్రెస్ పార్టీ నాయకులే బిజేపికి జీవం పోస్తారా? కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులు తేల్చుకోవాల్సిన తరుణం వచ్చినట్లే వుంది. లేకుంటే కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండాపోయే ప్రమాదం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా ఆదరించి, అదికారమిచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులది. ఏపిలో కూడా కాంగ్రెస్ బతికి బట్టకట్టేలా కాంగ్రెస్ నాయకులు కషి చేస్తే ఆ పార్టీ రుణం తీరుతుంది. అంతే కాని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేకుండాపోయేలా కాంగ్రెస్‌లో ఏ నాయకుడు ప్రవర్తించినా అది మోసమే? అవుతుంది. ఓ వైపు రాహుల్ గాంధీ కాలుకు బలపం కట్టుకొని దేశమంతా రెండుసార్లు పాదయాత్రలు చేసి, కాంగ్రెస్‌కు ఎలా ఊపిరిపోయాలా! అని కష్టపడుతుంటే కనీసం ఉడుత సాయం చేయాల్సిన నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాలకు స్వాగతం పలకడం విచిత్రం. కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టిన నాయకులు రాజకీయం ఎలా వుంటుందో ఉమ్మడి రాష్ట్రంలో చూడలేదా? పార్టీకి ఏ మాత్రం ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయని తెలిసినప్ప్పుడు సిఎం.లను కూడా దించేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులకువుంది. అలా కలిసి కట్టుగా, పార్టీని నిలబెట్టుకున్న నాయకులు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు. అయినా పదే పదే సిఎం. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? ఇక్కడి విషయాలు డిల్లీకి చేరడం లేదా? లేక నాయకులు డిల్లీ పెద్దలకు చెప్పడం లేదా? పుట్టి పూర్తిగా మునిగితే తప్ప తేరుకోలేరా? కాంగ్రెస్ అభిమానులే సిఎం. మాటలను జీర్ణించుకోవడం లేదు? అలాంటిది కాంగ్రెస్ నాయకులు ఎలా మౌనంగా వుంటున్నారన్నదే ప్రశ్న???