కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?
టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్(Virat Kohli) ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
