పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్..

పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్

 

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ గెలిచాక కోహ్లీ-అర్ష్‌దీప్ సింగ్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసుకుని సఫారీల ఓటమిని శాసించారు. ఇటు బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(116*), విరాట్ కోహ్లీ(65*), రోహిత్ శర్మ(75) అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్ ఆసాంతం కోహ్లీ ఫన్, జోష్ అందరిని ఆకట్టుకుంది. ఈ సారి విరాట్ ట్రోలింగ్‌కు పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) బలైయ్యాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version