విద్యార్థికి లాప్ టాప్ ఇచ్చిన దాత

విద్యార్థికి లాప్ టాప్ ఇచ్చిన దాత

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

రాజ కౌశిక్ విద్యార్థికి హబూబ్ నగర్ లో మాంటిసోరి పాఠశాల జె పి ఎన్ సి ఇంజనీరింగ్ లో అర్టిఫి కల్ ఇంటిలిజెన్స్ కోర్సులో సీట్ సాధించినoదుకు పెబ్బేరు
సంబు రాము, సంబు కృష్ణయ్య కల్వ రాలకు చెందిన ప్రభాకర్ దృష్టి కి తీ సుకపోవడముతో విద్యార్థి కి ఉచితంగా లాప్ టాప్ ను అందజేశారని సంబు క్రిష్ణ య్యా తెలిపారు ఈసందర్భంగా ప్రభాకర్ ను రాజ కౌశిక్,కుటుంబ సభ్యులు సంబు కృష్ణయ్య రాము కు కృతజ్ఞతలు తెలిపారు

మాజీ మంత్రిపుట్టినరోజు సందర్భంగా…

మాజీ మంత్రిపుట్టినరోజు సందర్భంగా

కాన్వాయితో స్వాగతం పలికిన బి.ఆర్ ఎస్ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 67వ జన్మదిన వేడుకల సందర్భంగా కాన్వయితో బీ ఆర్ ఎస్ నేతలు స్వాగతం పలికారు . భారీ కాన్వాయ్ తో ఇంటికి చేరుకు న్నారు బీ ఆర్ ఎస్ నేతలు సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, సునీల్ వాల్మీకి ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు వేదపండితులు పెద్దల ఆశీర్వాదం మాజీ మంత్రి తీసుకున్నారు. మోహన్ పండ్లతో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు బీ ఆర్ ఎస్ వనపర్తి పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.నాగవరం గ్రామములో నిరంజన్ రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పుట్టిన రోజు వేడుకలలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల్ బండారు కృష్ణ పెండం నాగన్న యాదవ్ జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా ఇంఛార్జి నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్ ఘన పురం బీ ఆర్ ఎస్ నేతలు లక్ష్మారెడ్డి,.కృష్ణయ్య, వనపర్తి మండల బీ ఆర్ ఎస్ నేతలు పెద్దగూడెం .మాణిక్యం చిట్యాల వెంకట్ రావు,మాధవ్ రెడ్డి,ధర్మా నాయక్, సాయి యాదవ్,పెద్దమందడి నేతలు రఘుపతి రెడ్డి,వేణు యాదవ్ మోహన్ యాదవ్ సేనాపతి పెబ్బేరు నాయకులు ఎద్దుల కరుణ శ్రీ,వనం.రాములు,దిలీప్ రెడ్డి,గోపాల్ పేట నాయకుల బాలరాజు చంద్రశేఖర్,శ్రీనివాస్,కె.భాస్కర్,మతీన్,మాన్య నాయక్ ఎదుల నాయకులు రమేష్,రాజారెడ్డి,అబ్దుల్లా రెవల్లి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారని నంది మల్ల అశోక్ తెలిపారు

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్….

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .

 

వల్లబ్ నగర్ 33 వార్డులో రామ్ సేన యూత్ మహిళా సంఘం సభ్యులు దసరా ఉత్సవాలలో సందర్భంగా దుర్గామాత ప్రత్యేక పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమాల్ తెలిపారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు పూజలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య గులాం సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి చిట్యాల రాము బీచుపల్లిసాగర్ రాఘవేంద్ర క్రాంతి తదితరులు పాల్గొన్నారని తిరిమాల్ ఒక ప్రకటన లో తెలిపారు

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ…

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాం గౌరవ అధ్యక్షులు నాగబంది యాదగిరి యూవజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పిన్నం వసంత ఆర్యవైశ్య మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ పూజలు చేయిస్తున్నా రు

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి…

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్. ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరకాస్తు లు స్వీకరించారు
ప్రజల ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను కోరారు

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు…

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం లో అమ్మవారి అభిషేకం పూజలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య దంపతులు అంగడి నరేందర్ కట్ట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు వారిచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు . అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్ కోరారు

స్వరాష్ట్ర సాధనలో కృషి చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జిల్లా ఎస్పీ .

స్వరాష్ట్ర సాధనలో కృషి చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జిల్లా ఎస్పీ .

వనపర్తి నేటిదాత్రి .

జిల్లా పోలీసుకార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్బంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులుర్పించారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ డిఎస్పీ, ఉమా మహేశ్వర్ రావు కార్యాలయం ఏఓ, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు శ్రీనివాస్ డిసిఆర్బి ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి…

కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి
వనపర్తి నేటిదాత్రి

వనపర్తి పట్టణం లో 10, 21 వ వార్డు మధ్యలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ అఖిల్ పక్ష ఐక్యవేదిక నాయకులు సందర్శిం చారు ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 21వ వార్డులో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కొంత పూర్తి చేశారని తెలిపారు నిర్మాణం పూర్హి చేసి కూరగాయల వ్యాపారులకు ఇస్త వనపర్తి లో ట్రాఫిక్ సమస్య ఉండదని అన్నారు కందకంలో నీరు నిలిచి ప్రజలు రోగాల కు గురి అవుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి కందకము లో కురాగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు సతీష్ యాదవ్ వెంట వెంకటేశ్వర్లు,తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, రామస్వామి, కురుమూర్తి, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జిల్లా కలెక్టర్ కార్యాలయం లోకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .   

 

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని  ప్రతి పౌరుడు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ  జయంతి వేడుకలను జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపి శంకర్ నాయక్ రాజేంద్రప్రసాద్, బీసి. సంక్షేమ శాఖాధికారి ముజాహిద్దీన్, జిల్లా అధికారులు పద్మశాలి సంఘం నాయకులు.సామాజికవేత్త రాజారాం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు

జిల్లా ఎస్పీ కార్యలములో వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి…

జిల్లా ఎస్పీ కార్యలములో వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి

నివాళులర్పించిన ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి నేటిదాత్రి

 

శుక్రవారం జిల్లా పోలీసుకార్యాలయంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులుర్పించారు 
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ వీరనారి తెలంగాణ రైతాంగ పోరాటానికి నాంది చాకలి ఐలమ్మ తన చిన్న వయసులోనే భూస్వామ్య వ్యతిరేకంగా శక్తివంతమైన పోరాటాన్ని చేపట్టి, భూములను ఆక్రమించుకున్న నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటo చేశారని అన్నారు
ఈ కార్యక్రమంలో ఏ ఆర్, అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఆర్బీ డిఎస్పీ, ఉమా మహేశ్వర్ రావు కార్యాలయంల ఏఓ, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

9 లీటర్ల నాటుసారా పట్టివేత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-26T142641.811.wav?_=1

 

9 లీటర్ల నాటుసారా పట్టివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: బైక్పై నాటుసారా తరలిస్తున్న కర్ణాటకలోని కలబుర్గి జిల్లా చించోళి తాలూకా శ్రీనగర్ తండాకు చెందిన పాండును అరెస్టు చేసినట్లు జహీరాబాద్ ఆబ్కారీ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి తొమ్మిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నాటుసారా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వనపర్తి లో చాకలికలి ఐలమ్మ జయంతి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-26T141424.118.wav?_=2

 

వనపర్తి లో చాకలికలి ఐలమ్మ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత ను రాజారాం ప్రకాష్ ను సన్మానం చేసిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో తెలంగాణ పోరాట రైతాంగం పోరాట యోధులు దివంగత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కొత్త బస్టాండ్ దగ్గర ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత రాజా రామ్ ప్రకాష్ ను ఎమ్మెల్యే శాలువతో ఘనంగా సన్మానించారు ఆయనను అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ బి క్రిష్ణ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ మీడిదొడ్డి రమేష్ లక్కకుల సతీష్ సోషల్ మీడియా ఇంచార్జ్ ద్వార పోగు వెంకటేష్ మాజీ మున్సిపల్ కౌన్సిల ర్ల సత్యం సాగర్ మాజీ మున్సిపల్ కోఆప్షన్ జి జె శ్రీనివాసులు శ్రీరంగాపురం శ్రీహరి రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సత్య శీలరెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీర వనిత ఆకలి ఐలమ్మ చేసిన పోరాటాలపై కొనియాడారు

భవాని మాతను దర్శించుకున్న నాయకులు…

భవాని మాతను దర్శించుకున్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని మాత అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతోపాటు శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ శేఖర్ పటేల్ ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు మోహన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్…

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి రానున్న ఇండోర్ స్టేడియాన్ని ప్రజలు సద్వినియోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్థవంతంగా స్టేడియాన్ని ఉపయోగించుకునేలా అన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు క్రీడాకారుల సౌకర్యార్థం సరైన మెయింటెనెన్స్, సీటింగ్, లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఇంజినీరింగ్, క్రీడా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంత త్వరగా అన్ని అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు బదులిచ్చారు.
పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

5వ వార్డులో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం….

5వ వార్డులో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని శివ తెలిపారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పాపిశెట్టి శ్రీనివాసులు ఆర్ఎంపీ డాక్టర్ డానియల్ కాగితాల లక్ష్మీనారాయణ సురేందర్ కన్నా భక్తులు పాల్గొన్నారు

స్వయ రచన పుస్తకాన్ని ఎస్పీకి అందజేసిన నిరంజనయ్య…

స్వయ రచన పుస్తకాన్ని ఎస్పీకి అందజేసిన నిరంజనయ్య

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కు స్వీయ రచన కాలగమనం పుస్తకాన్ని సాహితీ కళావేదిక అధ్యక్షులు పలస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో అందజేశామని పుస్తకాన్ని రచించిన నిరంజన య్యా తెలిపారు సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను రచించాలని నిరంజనయ్య ను ఎస్పీ అభినందించారు గంధం నాగరాజు వడ్డేపల్లి ఎంఈఓ శివ ప్రసాద్ పాల్గొన్నారని ఆయన తెలిపారు

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143001.704.wav?_=3

కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు సహకరించిన బాధితులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో కొల్లాపూర్ రోడ్డులో విస్తరణకు బాధితులు సహకరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెల్ 9849905923 నెంబర్ తెలిపారు ఈ మేరకు నష్టపోయే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ సహకరించిన బాధితుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణకు సహకరిస్తున్నామని బాధితుడు దన్నోజిరావ్ తెలిపారు

అపోలో హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత ఇ ఎ న్ న్టి చెవి పరీక్షలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T120332.527.wav?_=4

 

అపోలో హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత ఇ ఎ న్ న్టి చెవి పరీక్షలు
విజయవంతం
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో ఆదివారం నాడు శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ అపోలో డాక్టర్లచే దాదాపు 200 మంది పేషెంట్లకు చౌడు కు చెవుడుకు సంబంధించిన వారికి ఉచితంగా పరీక్షలు చేయించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేషంట్లకు అవసరం ఉన్నవారికి ఉచితంగా వినికిడి మిషన్లు పంపిణీ చేశామని అదేవిధంగా అన్నదానం రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి ఏర్పాటు చేశారని వారి పేర్కొన్నారు చిన్న పిల్లలకు రెండు సంవత్సరాల వరకు వినికిడి లోపం ఉంటుందని వారికి శ్రీ సత్య సాయి సేవ సంస్థ డాక్టర్లకే ఆపరేషన్లు ఉచితంగా ఏర్పాట్లు చేయించామని వారు పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి ఆదివారం ప్రతి గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరపున ఉచితంగా హోమియోపతి డాక్టర్ పేషెంట్లకు వైద్యం చేస్తున్నారని అదేవిధంగా ఉచిత హోమియోపతి మందులు సరఫరా చేస్తున్నారని వారు పేర్కొన్నారు హోమియోపతి డాక్టర్ కు శ్రీ సత్య సాయి సేవ సంస్థ తరఫున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాదు రోడ్డులో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు పేషెంట్లకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరఫున దాదాపు 300 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు అన్నదానం ఏర్పాటు చేసేవారు శ్రీ సత్య సాయి సేవా సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డిని సత్యసాయి మందిరంలో సంప్రదించాలని మనోహర్ రెడ్డి వనపర్తి జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థ కన్వీనర్ నరహరి పుల్లయ్య శెట్టి ఒక ప్రకటనలో కోరారు

రాష్ట్రంలో పేదలందరికి సంక్షేమ పథకాలు…

రాష్ట్రంలో పేదలందరికి సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం మహిళ కు వరం

రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డ్

వనపర్తి నేటిదాత్రి .

 

 

రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాల ను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిఅన్నారు
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయము లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. .
అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను అధికారులు చదివి వినిపించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ లు రెవెన్యూ ఖిమ్యా నాయక్, స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర రావు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూచరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 78 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమయిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే ఈ రోజున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 555 సంస్థానాలు ఇండియన్ యునియన్ లో కలిశాయి, హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్ర రాజ్యాంగ ఉండేందుకు నిర్ణయించుకుందన్నారు రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు
మహాలక్ష్మి పథకం మహిళలకు వరం ప్రభుత్వం ప్రతి మహిళలను మహాలక్ష్మిగా చేయాలనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మొత్తం ప్రయాణికులలో 64.28 శాతం మహిళలు ప్రయాణించటం జరిగింది. ఇందుకు గాను రూ.97.54 కోట్లను ప్రభుత్వం భరించిందన్నారు.
మహిళల శక్తిగా మహిళా శక్తి పథకం జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయుటకు 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను ఇచ్చామని వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు దాదాపుగా రూ69 వేల ఆదాయం వస్తుందని అన్నారు
కొత్త రేషన్ కార్డుల మంజూరు
జిల్లాలో ఇప్పటివరకు 17,490 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయటం జరిగింది, దీని ద్వారా 45,576 మంది లబ్దిపొందారు. అలాగే ప్రస్తుత కార్డులలో కొత్తగా 29,858 మందిని చేర్చటం జరిగిందన్నారు.
పేదలకు ఆరోగ్యదాయనిగా మారిన రాజీవ్ ఆరోగ్యశ్రీ:అందరికీ ఆరోగ్యం” సాధించాలనే లక్ష్యంతో, రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా 1835 రకాల జబ్బులకు వైద్య సేవలను అందిస్తున్నాము. గతంలో ఉన్న వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి ఈ ప్రభుత్వం చెల్లించటం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో ఏప్రిల్ 1, 2024 నుండి ఇప్పటివరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు.
నిరుపేదల సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 6,173 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు ఉన్న 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉచిత కరెంటు జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాలలో సి సి కెమెరాల ద్వారా పర్యవేక్షణ నేరాలను నియంత్రించటం జరుగుతున్నదన్నారు పోలీస్ శీ టీ o ద్వారా మహిళల కు రక్షణ కల్పించటం. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించటం జరుగుతుంని. జిల్లా ప్రజలు, యువత సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాల నిర్వహన జిల్లా లో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిఘా టీమ్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్ డాగ్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్, బస్టాండ్, కళాశాలలు రద్దీ గల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూన్నారని అన్నారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ప్రజలకు న్యాయమూర్తులకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంపీలు ఎమ్మెల్సీ లకు,ఎమ్మెల్యే లకు , అదనపు కలెక్టర్లు జిల్లా ఎస్పీ విలేకరులకు జిల్లా అధికారులకు డి పి ఆర్ ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు

వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన నిరంజన్ రెడ్డి.

మృతుడికుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

వనపర్తి నేటిధాత్రి .
పెద్ద గూడెం గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి ఆకస్మికంగా మరణించారు ఈ విషయం తెలియడంతో మృతుని కుటుంబ సబ్యలను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు
మాజీ మంత్రి గారి వెంట వనపర్తి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షులు మాణిక్యం, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, మాజీ సర్పంచ్ కొండన్న, లక్ష్మీకాంతరెడ్డి, తిరుమలయ్య, శీను, చిరంజీవి, బి రాములు, బాలస్వామి, వంశీ, బాలకృష్ణ, వెంకటయ్య, ఏం రాములు, గ్రామ అధ్యక్షులు అశోక్, చోటు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version