ఘనంగా గుడ్ ఫ్రైడే..

ఘనంగా గుడ్ ఫ్రైడే

మంగపేట:నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో పునీత ఫ్రాన్సిస్ జేవియార్ చర్చ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3 వ తారీఖున గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు పాట్ల శ్రమల చరిత్రను సజీవ సిలువ మార్గం ద్వారా రూపొందించారు. క్రైస్తవ సంఘం నిజమైన దేవుడు క్రీస్తు ప్రభువు అని, విశ్వసించిన ప్రతి ఒక్కరు నిత్యజీవం పొందుతారని వారి పాపముల నుంచి రక్షించబడతారని అదే విధంగా తిరిగి పరలోక రాజ్యంలో చేరటానికి ప్రభువే స్వయంగా ప్రజల యొక్క పాపములను అతని మీద వేసుకొని సిలువ మరణం ద్వారా వారికి నిత్య జీవితాన్ని ప్రసాదించారని వారి యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమం ఫాదర్ చరణ్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎంసి సిస్టర్స్ మరియు రాజపేట సంఘ పెద్దలు కాటూర్, మల్లారం విశ్వాసులు యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తుమ్మనపల్లి సర్పంచ్ నజియా అంజుమ్ షేక్ సోహెల్ ని సన్మానించిన ఎమ్మెల్యే…

తుమ్మనపల్లి సర్పంచ్ నజియా అంజుమ్ షేక్ సోహెల్ ని సన్మానించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఝరాసంగం మండల్ తుమ్మనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నజియా అంజుమ్ షేక్ సోహెల్ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు ఎమ్మెల్యే మాణిక్ రావు ను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ లను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశం గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఎక్స్ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి జనార్దన్ రెడ్డి రమేష్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభు ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతారు…

ప్రభు ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతారు

క్రైస్తవులందరూ అదేవిధంగా ప్రేమను పంచాలి – డాక్టర్ ప్రవీణ్

తిరుపతి( నేటిధాత్రి)

 

ఏసుప్రభు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను పంచాడని అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేమని పంచాలని అప్పుడే నిజమైన క్రైస్తవులని ముఖ్య ప్రసంగీకులుగా పాల్గొన్న డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ అని తెలిపారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా వేపాడ మండలం, నల్లబెల్లి సీయోను ప్రార్ధన మందిరం నందు నిస్సి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ గొర్లె టైటాస్ అధ్యక్షతన క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకలుగా డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ విచ్చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఏ మనిషికైనా ఈ లోకజ్ఞానం వ్యర్ధమని దేవుని జ్ఞానమే నిజమైన జ్ఞానమని అటువంటి వారికే దైవ గ్రంథం లోని మర్మాలు అర్థమవుతాయని ఆ విధంగా నడుచుకున్న వారికే అత్యున్నత స్థానాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన చేతులతో, ఆయన పనికి వాడబడుతారని అన్నారు. ఏసుప్రభు వారు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమని పంచాడని అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేమని పంచాలని అన్నారు. ముఖ్య అతిధి టీవీఎస్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ మధు ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి వారి పిల్లల్ని ప్రేమగా పెంచాలని ప్రేమగానే వారికి విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఆనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందించారు
ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ లాజరస్, పాస్టర్ దావీదు, పాస్టర్ డేనియల్ పాల్, పాస్టర్ దేవకుమార్ ,కరుణాకర్ రచన దంపతులు, గ్రేస్ టైటస్, పాస్టర్, సంఘ పెద్దలు, యూత్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version