కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి హరీష్ రావు గురువారం కోహిర్ సబ్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంటలకు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటల పాటు పంటలకు విద్యుత్ అందేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు కూడా పాల్గొన్నారు.
