ఎన్నికల పోలింగ్ స్టేషన్లను సందర్శించిన డీసీపీ భాస్కర్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం లోని నర్వ,శివ్వారం గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్లను డీసీపీ భాస్కర్ శుక్రవారం సందర్శించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అనర్ధాలకు దారి తీయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని,ప్రజలు ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం జైపూర్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్,భీమారం,శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎన్నికలలో పాటించవలసిన నియమ నిబంధన గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వరరావు,జైపూర్ సిఐ నవీన్ కుమార్,శ్రీరాంపూర్ సిఐ శ్రీలత,జైపూర్ ఎస్సై శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, ఎస్సై లక్ష్మీ ప్రసన్న,భీమారం ఎస్సై శ్వేత ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసిల్దార్ వనజా రెడ్డి ఎంపీఓ బాపూరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
