గ్రామాల సమగ్ర అభివృద్దె కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల సమగ్ర అభివృద్దె కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి

నల్లబెల్లి , నేటి ధాత్రి:

ప్రతి గ్రామ సమగ్ర అభివృద్దె ప్రజా పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు.
మండలంలోని కొండైల్ పల్లి గ్రామంలో సర్పంచ్ స్వప్న నరేష్ ఆధ్వర్యంలో ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన సిసి రోడ్డు పనులను గురువారం చిట్యాల తిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన పక్కా రోడ్ల ఏర్పాటే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని సంక్షేమ పథకాలు అమలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పెంతల కొమర రెడ్డి ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కుసుంబ రఘుపతి ,మండల కార్యదర్శి జిల్లామునీందర్, నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ,డేగల కృష్ణ ఎరుకల రవి, పంచాయతీ కార్యదర్శి రజిత,గ్రామస్తులు ప్రతాపరెడ్డి ,లక్ష్మణ్ రెడ్డి ఉపసర్పంచ్ నాగిరెడ్డి, అనంతరావులు ,కొనకటి రమేష్ ,వీరస్వామి, కీసరి రామ పెంతల విజయ, తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటి ధాత్రి:

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి పథకం అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట నల్లబెల్లి,దుగ్గొండి,ఖానాపురం,చెన్నారావుపేట,నెక్కొండ మండలాలతో పాటు నర్సంపేట పట్టణం సంబంధించిన 305 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
పేద ప్రజలకు అండగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని లక్ష్యమని తెలిపారు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వైస్ చైర్మన్ హరిబాబు,ఎమ్మర్వోలు రవిచంద్రారెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్స్,అధికారులు,సర్పంచ్ లు,
ప్రజా ప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దొంతి

ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా
చెన్నారావుపేట మండలం అమ్మినాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version