కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

 కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ నిన్న (శనివారం) కరూర్‌లో నిర్వహించారు. అయితే, ఈ రోడ్‌షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.

 తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ (TVK Chief Vijay) నిన్న (శనివారం) కరూర్‌లో రోడ్‌షో (Karur Road Show) నిర్వహించారు. అయితే, ఈ రోడ్‌షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
క్షతగాత్రులకు తమిళనాడు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అంజేస్తున్నామని వివరించారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం నాయకులు నాయకురాల చేతుల మీదుగాపంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెంచుకోవాలని పరిస్థితుల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వారికి ఎంతో ఉపయోగపడుతుందని అలాంటిది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆపద సమయంలో వైద్యం చేయించుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పొందవచ్చు గాని ఈ సందర్భంగా తెలియజేశారు ఎందుకుగాను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గజ్జల రవి 9500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కి ఇట్టి చెక్కులు రావడానికి కృషి చేసిన వీరందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. గోరింటాల రాజమల్లు. బొల్లి శంకర్. నూతి మార్కండేయ. గోరింటాల మాధవి. దీకొండ జ్యోతి. దూస లత. బేతి జయ. పార్టీ నాయకులు నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version