కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత…

కల్తీ కార తయారీ కేంద్రాలపై దాడులు.. రెండు కేంద్రాలు మూసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో కల్తీ కారతయారీ కేంద్రాలపై పోలీసులు మంగళవారం భారీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు కల్తీ కార తయారీ కేంద్రాలను మూసివేసి, ఇద్దరు యజమానులను రిమాండ్ చేశారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే, పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరుకుతో పిండి
వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రగతి నగర్ కాలనీలోని “పరస్ కార తయారీ కేంద్రం” యజమాని పరాస్ నాథ్, అలాగే హమాలి కాలనీలోని “అభినయ శ్రీ స్పెషల్ కార తయారీ కేంద్రం” యజమాని ఆయెన పేరుమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ సమాచారం మేరకు, జహీరాబాద్ టౌన్ ఎస్ఐలు కే.వినయ్ కుమార్, రాజేందర్ రెడ్డి, కే.సంగమేశ్వర్ లు తమ సిబ్బందితో కలిసి ఈ రెండు కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. పరిశీలనలో, ఆ కేంద్రాల్లో అగ్ని భద్రతా నియమాలు, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండానే కొంతమంది పని మనుషులతో కల్తీ పిండి వంటలు తయారు చేస్తున్నట్లు తేలింది. ఈ విధంగా తయారు చేసిన పదార్థాలను జహీరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కార తయారీకి వాడిన పదార్థాలు, యంత్రాలు, ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టౌన్ ఎస్ఐ కే.వినయ్ కుమార్ పేర్కొన్నారు.

చరక్ పల్లి లో ఏక్తా దివస్ సందర్భంగా టూకే రన్ కార్యక్రమం…

చరక్ పల్లి లో ఏక్తా దివస్ సందర్భంగా టూకే రన్ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరాక్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో “ఏక్తా దివస్” సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” 2కే రన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఏక్తా, ఐక్యత ప్రాధాన్యతను చాటుతూ చరాక్ పల్లి ప్రధాన రోడ్డు మార్గంలో 2కె రన్‌ను నిర్వహించారు. చరాక్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి లతో కలిసి వివిధ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మండలంలోని యూవకులు, తదితరులు ఈ టూకే రన్‌లో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version