చరక్ పల్లి లో ఏక్తా దివస్ సందర్భంగా టూకే రన్ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చరాక్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో “ఏక్తా దివస్” సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” 2కే రన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఏక్తా, ఐక్యత ప్రాధాన్యతను చాటుతూ చరాక్ పల్లి ప్రధాన రోడ్డు మార్గంలో 2కె రన్‌ను నిర్వహించారు. చరాక్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి లతో కలిసి వివిధ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు మండలంలోని యూవకులు, తదితరులు ఈ టూకే రన్‌లో పాల్గొన్నారు
