ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ర్యాలీ

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ర్యాలీ
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి నియోజకవర్గ ఘనపురం మండల కేంద్రంలోప్రజా సమస్యలపై ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కొద్దీ సేపు ధర్నా చేశారు

కల్వకుర్తి పురపాలక అధికారుల…

కల్వకుర్తి పురపాలక అధికారుల
మోసాలకు అంతు లేదా…!

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

పని చేయని వారికి నెలనెలా జీతాలు… అధికంగా తైబజారు వసూళ్లు…
కల్వకుర్తి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేయని వ్యక్తులకు నెల నెల జీతాలు ఎలా…? అరెకంటి మహేశ్వరి ఆమె అచ్చంపేట వాస్తవ్యురాలు, ఆమె పురపాలక విధుల్లోకి చేరకుండానే కల్వకుర్తి పురపాలక కార్యాలయం ద్వారా ఆమె అకౌంట్లో నెల నెల రూ. 15,600లు గత 8 నెలలుగా ఆమెకు జీతం చెల్లిస్తున్నారు. ఆరెకంటి మహేశ్వరి గారు అదనపు కలెక్టర్ దేవ సహాయం (LBs) కార్యాలయ పరిధిలోని క్వాటర్స్ లో వంట మనిషిగా (అవుట్సోర్సింగ్) పనిచేస్తుంది. అలాంటిది ఆమెకు కల్వకుర్తి పురపాలక సంఘ అధికారుల వారు నేరుగా ఆమె అకౌంట్లో నెల నెల జీతం వేయడం విడ్డూరమని పట్టణవాసులు విడ్డూరంగా చర్చించుకుంటున్నారు.

 

 

ఇటీవలే పట్టణంలోని సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని ప్రశ్నించగా, పురపాలక కమిషనర్ వారు అతనిని భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా, వారి యొక్క తాత్కాలిక కట్టడమైన చిన్న రేకుల షెడ్డును కూల్చి వేస్తానని దానికి పర్మిషన్ లేదని, వారికి నోటీసులు ఇవ్వకుండా వారి చిన్న రేకుల షెడ్డు గోడకు నోటిసు అతికించారు. తాత్కాలిక కట్టడాలకు పరిమిషన్లు అవసరం లేదని పురపాలక చట్టం 1965 & 2019 చెబుతుంది. ఆ విషయాలు కూడా తెలియని వారు పురపాలక కమిషనర్ గా పనిచేయడం వృతికే సిగ్గుచేటు అని పలువురు గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా చిరు వ్యాపారులు తైబజార్ పేరిట అధికంగా వసూలు చేస్తున్నారని అధికారులకు ఎంత విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. పది రూపాయలు వసూలు చేయవలసిన వ్యాపారానికి 40 రూపాయలు తైబజార్ వసూలు చేయడం. అలాగే 30 రూపాయలు తైబజారు వసూలు చేయవలసిన టిఫిన్ సెంటర్లకు వంద రూపాయలు తైబజార్ వసూలు చేస్తున్నారు. పుర అధికారులకు ప్రజలు ఎన్నో మార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ఈ తైబజార్ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవడం లేదని అధిక వసూలులో పురపాలక కమిషనర్ యొక్క పాత్ర ఎంతైనా ఉందని, అందుకే పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ప్రతిరోజు వసూలు చేసిన డబ్బులను అవుట్సోర్సింగ్ లేక పర్మినెంట్ ఉద్యోగులు మేనేజర్ గారికి లెక్క కట్టి జమ చేయాలి, అలా జమ చేయకుండా రెండు నెలలు తన సొంత ఆసరాలకు వాడుకున్నందుకు దేవర్ల శ్రీనివాసును అప్పటి ఇప్పటి మేనేజర్ అయిన ఫాని రాజాకుమారి నూరీ గారు అతనిని సస్పెండ్ చేయించి, ఒక ఇంక్రిమెంట్ కట్ చేసి కొల్లాపూర్ కు ట్రాన్స్ఫర్ చేయించినారు. 68 లక్షల ఒక సంవత్సరం పాటు వాడుకొని అరకొర జమ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేనేజర్ ఫణి రాజకుమారి నూరి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పట్టణ ప్రజలు వాపోతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version