బిక్షటన చేసిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు.

బిక్షటన చేసిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు.

మందమర్రి నేటి ధాత్రి

 

కార్మిక శాఖ మంత్రి ఇలాకాలోనే రోడ్డున పడ్డ కార్మికులు…

కార్మికుల ఓట్లు తప్ప, 220 కుటుంబాల గోస పట్టదా?.

పోరాటంలో భాగంగా 3వ రోజు బిక్షటన చేసిన ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు.

అధికారులు, పాలకులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే ప్రజా పోరాటంగా ముందుకు వస్తాం.

దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు.

తొలగించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి వీధిలోకి తీసుకోవాలని ఎస్సీ కేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం మూడవ రోజుకు చేరుకుంది. పోరాటంలో భాగంగా మందమరి ఏరియాలోని మార్కెట్ ప్రాంతంలో బిక్షాటన చేస్తూ, కార్మికులు ప్రజలకు తమ గోడును తెలియజేశారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా పోరాటానికి అండగా నిలబడుతామని బరోసా కూడా ఇవ్వడం జరిగింది . అనంతరం దూలం శ్రీనివాస్ ఎస్ సి కె ఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ…
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున 220 మంది కార్మికులను టెండర్ పేరుతో తొలగించి రోడ్డున పడేసి, రెండు నెలలు కావస్తున్నా కార్మిక శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే అధికారులు సైతం వారి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చాడానికే టెండర్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. 12 సం”రాలుగా సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తు తమ యవ్వనాన్ని, అనుభవాన్నే కాకుండా వాళ్ల విలువైన భూములను సైతం కొల్పొయిన వారి పట్ల అధికారులు ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు గా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, కార్మికులందరినీ ఎలాంటి షరతులు లేకుండా పాత పద్ధతిలోనే పూర్తిస్థాయిలో అందర్నీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే ఈ కార్మికుల పోరాటానికి ప్రజల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టి ఈ పోరాటాన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకు రావడానికి కూడా వెనుకడుగు వేయమని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సరళంగా నడుస్తుంది…

కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ సరళంగా నడుస్తుంది

మందమర్రి నేటి ధాత్రి

 

ఎండల తీవ్రత దృష్ట్యా కాంట్రాక్టు కార్మికుల పని వేళలు మార్చాలి.

కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, తాగేందుకు చల్లటి మంచినీళ్లు అందించాలి.

సివిల్ అధికారులకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం.

దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చి, కార్మికులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఓ ఆర్ ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అలాగే పని ప్రదేశంలో త్రాగడానికి చల్లటి మంచినీళ్లు ఏర్పాటు చేయాలని ఈరోజు మందమర్రి ఏరియాలోని సివిల్ అధికారులకు వినతిపత్రం ఎస్సీకేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ
సింగరేణి సంస్థ ఆరోగ్యంగా ముందుకు సాగాలంటే కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి. రోజు రోజుకు తీవ్రంగా పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా సివిక్ కాంట్రాక్టు కార్మికులు ఎండ తీవ్రతకు డిహైడ్రేషన్ బారిన పడి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల కార్మికులకు పని వేళలను ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మార్పు చేయాలని అలాగే కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగడానికి చల్లటి మంచినీటి ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియుగా విజ్ఞప్తి చేశారు. అధికారులు కార్మికుల ఆరోగ్య దృశ్య వెంటనే స్పందించి పని వేళలు మార్చి, కార్మికులు ఎండ దెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు విరివిరిగా సివిల్, సివిక్ కాంట్రాక్టు కార్మికులకు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, సివిక్, సివిల్ కాంట్రాక్టు కార్మికులకు పాల్గొన్నారు.

మందమర్రి లో యంపీ గడ్డం వంశీకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు..

మందమర్రి లో యంపీ గడ్డం వంశీకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు..

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు మందమర్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బి-1 వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేయడం జరిగింది.కార్యక్రమంలో సీనియర్ నాయకులు పైడిమల్ల నర్సింగ్,ఇషాక్,రాజ్ కుమార్,వేముల శ్రీనివాస్,కిరణ్ ,శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నీరటి వెంకటేష్,పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్,జావీద్, ఒజ్జ గణేష్,మేరుగు సతీష్,సాయికిరణ్,ధనుక్ రాజేష్,మధుకర్,ప్రదీప్, రహీం,మహేష్,రిత్విక్,పార్థు,కిరణ్,రాజు పాల్గొన్నారు.

మందమర్రిలో వివాహిత ఆత్మహత్య

*ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య*

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియా మొదటి జోన్‌కు చెందిన సబ్బని విజయలక్ష్మి (53) ఉదయం తన నివాసంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే:
మృతి చెందిన విజయలక్ష్మి గత పది ఏళ్లుగా పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె భర్త సబ్బని శేఖర్ మాజీ సింగరేణి ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడు నెలల క్రితం విజయలక్ష్మికి హైదరాబాద్‌లో పక్షవాతానికి సంబంధించిన బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె మానసిక వేదనకు గురయ్యారు. అనారోగ్యం రీత్యా ఆమె తన ఉపాధ్యాయ వృత్తికి కూడా స్వస్తి పలికారు.
ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె, సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త సబ్బని శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version