ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

 ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

 

ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.

ఈ మహానాడులో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ ఈ మహానాడుకు హాజరైన మహిళలను చూస్తూంటే మరోమారు డీఎంకేకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే భావన తనకు కలుగుతోందన్నారు. మహానాడును ఇంత గొప్పగా ఏర్పాట్లు చేపట్టిన తన సోదరి కనిమొళి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రానున్నది మహిళా సంక్షేమ పాలన కనుకనే ప్రస్తుతం డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా కనిమొళికి అప్పగించానని తెలిపారు. రాష్ట్రంలో పెరియార్‌, అన్నాదురై వంటి మహాపురుషులు మహిళాభ్యుదయం కోసమే తీవ్రంగా పాటుపడ్డారని గుర్తు చేశారు.డీఎంకేకు ముందున్న జస్టీస్‌ పార్టీ తొలి సమావేశం 1914లో జరిగిందని, ఆ సమావేశంలో తొలిసారిగా ఓ మహిళ పాల్గొందని, ఆమే పేరే అలమేలు మంగతాయరమ్మాళ్‌ అని స్టాలిన్‌ తెలి పారు. 1949లో డీఎంకే ఆవిర్భావంలో సత్యవాణి ముత్తు వంటి మహిళా ప్రముఖులు కీలక పాత్ర పోషించారన్నారు. 1956లో అన్నాదురై పార్టీలో మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ విభాగానికి మరింత జవసత్వాలు కలిగించారని, అప్పటి నుండి డీఎంకేలో ఈ మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

 టీవీకే అధినేతకి ఝలక్‌.. డీఎంకేలో చేరిన విజయ్‌ మాజీ మేనేజర్‌.

 టీవీకే అధినేతకి ఝలక్‌.. డీఎంకేలో చేరిన విజయ్‌ మాజీ మేనేజర్‌

 

మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‏కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్‌ ఝలక్‌ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.

చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షులు, ప్రముఖ సినీనటుడు విజయ్‌ మాజీ మేనేజర్‌, ‘కలప్పై మక్కల్‌ ఇయక్కం’ అధ్యక్షుడు పీటీ సెల్వకుమార్‌ డీఎంకేలో చేరారు. స్థానిక తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఆయన డీఎంకేలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, అధికార ప్రతినిధి ఆర్‌ఎస్‌ భారతి, మంత్రి పీకే శేఖర్‌బాబు, ఆలంకుళం ఎమ్మెల్యే మనోజ్‌ పాండిన్‌ తదితరులు ఉన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version