ఉల్లిగడ్డ పొట్టును పడేస్తున్నారా? ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..

ఉల్లిగడ్డ పొట్టును పడేస్తున్నారా? ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..

మనం ఏదైతే పనికిరాదని భావించి పడేస్తున్నామో.. దానితోనే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా? అవును, పనికిరాదని చెత్తబుట్టలో వేసే ఉల్లిపాయ పొట్టుతో బోలెడు ప్రయోజనాలు..

Onion Peels Benefits: ఉల్లిగడ్డ/ఉల్లిపాయ లేకుండా వంట వండటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కొంతమంది మినహా ఉల్లిపాయ లేకుండా వంటలు చేయరంటే అతిశయోక్తి కాదు. ఉల్లిపాయతో వంట చేసే వారు.. ముందుగా దాని మీద ఉన్న పొట్టును తీసి పడేస్తుంటారు. దానితో ఎలాంటి ప్రయోజనం లేదని చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, మనం ఏదైతే పనికిరాదని భావించి పడేస్తున్నామో.. దానితోనే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా? అవును, పనికిరాదని చెత్తబుట్టలో వేసే ఉల్లిపాయ పొట్టుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఉల్లిపాయలో అనేక పోషకాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఉల్లిపాయ పొట్టులోనూ ఇవే ఉంటాయని.. అందుకే వీటిని పడేయొద్దని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. వీటిని ముఖారవిందానికి, మొక్కుల ఎదుగుదల కోసం, ఇంటిని శుభ్రపరచడానికి సహా అనేక రకాలుగా వినియోగించొచ్చని చెబుతున్నారు.

ఉల్లిపాయ పొట్టును ఎలా ఉపయోగించాలి?

1. సహజ ఎరువులు

ఉల్లిపాయ పొట్టు మొక్కల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. సహజ ఎరువుగా పని చేస్తుంది. మొక్కల మొదలు వద్ద ఉల్లిపాయ పొట్టు వేస్తే.. అది కంపోస్ట్ ఎరువుగా మారి.. ఆ మొక్కకు పోషకాలను అందిస్తుంది. మొక్కలకు కొత్త ఆకులు చిగురిస్తాయి.

2. జుట్టు ఆరోగ్యం..

ఉల్లిపాయ పొట్టు జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ పొట్టును ఒక గిన్నెలో ఉడికించి.. చల్లార్చాలి. ఆ తరువాత దానిని పేస్ట్‌లా చేసి.. జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు స్ట్రాంగ్‌గా, పొడవుగా, మృదువుగా మారుతుంది.

3. ఉల్లిపాయ పొట్టుతో టీ..

ఉల్లిపాయ పొట్టు టీ చేసుకుని తాగుతారని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఉల్లిపాయ పొట్టుతో టీ చేసుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4. చర్మ సంరక్షణ

ఉల్లిపాయ పొట్టు చర్మ సంరక్షణలో అద్భుతంగా పని చేస్తుంది. ఉల్లిపాయ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయ పొట్టును నీటిలో మరిగించి.. ఆ నీరు చల్లారిన తరువాత చర్మానికి అప్లై చేయాలి. చర్మం మృదువుగా మారుతుంది.

5. ఇంటిని శుభ్రం చేయడంలో..

ఇంటిని శుభ్రం చేయడానికి ఉల్లిపాయ పొట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ పొట్టును నీటిలో మరిగించి.. ఆ నీటిని వంటగదిని శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. దీనితో శుభ్రం చేయడం వల్ల దుర్వాసనలు తొలగిపోతాయి. ప్రతిరోజూ ఇలా చేసుకోవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version