నూతన సర్పంచ్లకు ఎమ్మెల్యే మాణిక్తేవు శుభాకాంక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను ఎమ్మెల్యే మాణిక్తావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జీర్లపల్లి అమరేశ్వరి శివమణి, గూడ్పల్లి సుదర్శన్రెడ్డి, చిలెమామిడి జైరాజ్, కంబాలపల్లి రాజు, నర్సాపూర్ జైపాల్రెడ్డిలను అభినందించారు. గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
