రైతులకు అండగా ఉంటాము…

 

రైతులకు అండగా ఉంటాము

ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి

వడగళ్ళ వానతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

ఇటీవలే కురిసిన వడగళ్ళ భారీ వర్షనికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలం మల్లూర్ మెయిన్ రోడ్డు దగ్గర రైతులకు అండగా
రైతుల పక్షణ ధర్నా లో
ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి పాల్గొని కార్యక్రమంలో ఇరువురు మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షలకు నష్టపోయిన రైతులకు ఇంత వరకు నష్టపరిహారం అందించలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం, వడగళ్ళ వానతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది, టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజుల తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ కి దక్కుతుందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరిగోశ పెడుతుందని అన్నారు,రైతులకు 24గంటల కరెంట్ అందించాలి,రైతులు రాత్రిపూట పొలాల్లో పడుకునే దుస్థితి నుండి కాపాడాలి, రైతులకు సకాలంలో యూరియా అందించే విధంగా చూడాలి యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కానడడం లేదా అని అన్నారు, ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, పి ఏ సీ ఎస్ చైర్మన్ తోట రమేష్,గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవిందానాయక్, జిల్లా నాయకులు, కాకులమర్రి ప్రదీప్ రావు తాటి కృష్ణ ,తుమ్మ మల్లారెడ్డి, ,భూక్యా జంపన్న,యడ్లపల్లి నర్సింహా రావు, చిట్టీమల్ల సమ్మయ్య, కూర్బన్, చిలకమర్రి రాజేందర్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, PACS చైర్మన్ కునుర్ అశోక్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పి ఏ సీ ఎస్ వైస్ చైర్మన్ కడబోయిన నరేందర్, మల్లూర్ దేవస్థాన మాజీ చైర్మన్ నూతిలకంటి ముకుందం, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, పార్టీ నాయకులు బుట్టో, గాదె శ్రీనివాస్ చారి, పూజారి శ్రీనివాస్ ,మండల యూత్ అధ్యక్షులు గుమ్మలా వీరాస్వామి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,మహిళలు,సోషల్ మీడియా వారియర్స్, యూత్ నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

రిలే నిరాహారదీక్ష కు టీడీపీ సంపూర్ణ మద్దుతు…

 

రిలే నిరాహారదీక్ష కు టీడీపీ సంపూర్ణ మద్దుతు

ఎమ్మెల్యే,జీఎం స్పందించాలి టీడీపీ డిమాండ్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సపూర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు శనివారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సపూర్ చెక్ పోస్ట్ వద్ద హై లెవల్ బ్రిడ్జి, లచ్చుగుడెం దారిలో నూతన కల్వర్టు నిర్మాణం అలాగే నర్సపూర్ నుండి బెజ్జల రోడ్డుకు అటవీశాఖ అనుమతి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలోతాండూర్ మండల తుడుం దెబ్బ అధ్యక్షులు కుర్సెంగ బాబురావు, సోయం సురేష్, ఆత్రం బాదిరావు, సోయం వంశీకృష్ణ,ఆత్రం సురేష్ తదితరలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version