మల్లాపూర్ ఆగస్టు 29 నేటి ధాత్రి
మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామానికి చెందిన ఓదెల సరోజన భర్త గజానంద్ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు కాగా వారికి ఉన్న ఇల్లు శిధిలావస్ఢలో ఉండి కూలిపోయింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం ద్వార తనకు నెల రోజుల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. అతను ఇల్లు నిర్మించుకొనుటకు ముగ్గుపోసి, ఫోటో క్యాప్చర్ కోసం సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, వారు ఫోటో తీయనని, నీ మీద ఫిర్యాదు ఉందని చెప్పడంతో ఆ వ్యక్తి విస్తుపోయాడు గ్రామపంచాయతీ ఆవరణలోని బాధపడుతూ కూర్చున్నాడు దీనిపై అధికారులు స్పందించి విచారణ చేపట్టి పేదవారు అయినా గజానందు దంపతులకు ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని
కోరుతున్నారు