నరేందర్ కు బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డు

నరేందర్ కు బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం జూకలు గ్రామానికి చెందిన
ప్రముఖ విద్యావేత్త లక్ష్మీ విద్యా నికేతన్ కరస్పాండెంట్ నూనె నరేందర్ బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపిక
అవార్డుకు ఎంపికైనారు, నూనె నరేందర్ మాట్లాడుతు
మా తండ్రి కీర్తిశేషులు నూనె రాజయ్య ఆశయాలను కొనసాగిస్తూ లక్ష్మీ విద్యానికేతన్ నడిపిస్తూ నిరుపేదలకు విద్యనందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ నేను చేస్తున్న సేవలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా బహుజన సాహిత్య అకాడమీ హైదరాబా ద్ నేషనల్ ఆఫీసులో బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సాంక్షన్ లెటర్ అందుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ తో పాటు కోఆర్డినేటర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల విజయకుమార్ అవార్డుల సెలక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు తాటికంట ఐలయ్య చేతుల మీదుగా సాంక్షన్ లెటర్ తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈఅవార్డు సెప్టెంబర్ 5వ తారీఖున సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినని పురస్కరించుకొని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కాన్ఫరెన్స్కు సౌత్ ఇండియా లోని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు కేరళ పాండిచ్చేరి రాష్ట్రాల నుండి 600 మంది డిజిల్స్ పాల్గొంటారని వారి సమక్షంలో విద్యావేత్త నూనె నరేందర్ కు బెస్ట్ సర్వీస్ సొసైటీ ఇంటర్నేషనల్ అవార్డ్ ప్రధానం చేయనున్నారు.

నరేంద్రమోదీ 11 ఏళ్లలో జనరంజకమైన పాలన.

నరేంద్రమోదీ 11 ఏళ్లలో జనరంజకమైన పాలన.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యాశాల కార్యక్రమం శనివారం కల్వకుర్తి మండల పరిధిలో బిజెపి పార్టీ ఆఫీసులో కల్వకుర్తి బిజెపి మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ పార్టీ పతాక ఆవిష్కరణ చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండికారి బాలాజీ రాష్ట్ర నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ..ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని కేవలం 11 ఏండ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి విశేష కృషి వలన జిడిపిలో నాలుగో స్థానానికి ఎగ బాకడమే కాకుండా దేశంలోని 27 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి దూరం చేసి మధ్యతరగతి ప్రజలుగా మార్చిన గొప్ప నాయకుడు మన నరేంద్ర మోడీ గారని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా రోగానికి వ్యాక్సిన్ అందించి ప్రపంచాన్ని కాపాడిన గొప్ప నాయకుడని అన్నారు. పెహల్గాం తీవ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కర మూకలకు , తీవ్రవాద అనుకూల పాకిస్తాన్ కు సరైన బుద్ధిచెప్పి ప్రపంచానికి భారతదేశ యుద్ధ శక్తిని తెలియజేశారని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. కుల మతాలకతీతంగా తీసుకు వచ్చిన ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విమాన ప్రమాదంలో మరణించిన వారికోసం మౌనం పాటించి నివాళులు అర్పించారు.
కార్యాశాల కార్యక్రమం అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి పట్టణ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు బండల రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి నారేడ్ల శేఖర్ రెడ్డి మాజీ మండలం అధ్యక్షులు సురేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, సింగల్ విండో వైస్ చైర్మన్ శ్యాంసుందర్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు నోముల రవీందర్ రెడ్డి , పుట్ట మల్లేష, మండల కార్యదర్శులు పి లింగారెడ్డి, సైదులు గౌడ బిజెపి కార్యవర్గ సభ్యులు మందరాజు రెడ్డి, కరుణ రెడ్డి సురేష్ గౌడ్, కిరణ్ రెడ్డి, సంతోష్ నాయక్ బీజేవైఎం నాయకులు నాప శివసేన, బూతు అధ్యక్షులు ఆనంద్,ఆంజనేయులు, విజయ్, సాయిబాబా, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version