కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి డోలు కొట్టి నృత్యం

డోలు కొట్టిన మల్లన్న

కేశవరం మల్లికార్జున స్వామి కళ్యానోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి మల్లికార్జున స్వామి కళ్యాణం లో డోలు కొట్టి నృత్యం చేస్తూ మరోసారి హల్చల్ చేశాడు. మూడు చింతలపల్లి మున్సిపల్ కేశవరం లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న జాతర సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్న ఎమ్మెల్యే ఒగ్గు కథ చెప్తున్నా సోదరుల డోలు కొడుతూ నృత్యం చేశాడు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా కేశవరంతో పాటు మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నేతలు, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version