కేంద్రం నోటీసులు.. ఆ యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ఎక్స్..

కేంద్రం నోటీసులు.. ఆ యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ఎక్స్..

 

కేంద్రం ఎక్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేయకుండా గ్రోక్ టెక్నికల్, గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను రివ్యూ చేసుకోవాలని తెలిపింది. యూజర్ పాలసీలు చాలా కఠినంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమించే వారి అకౌంట్లు సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయాలని స్పష్టం చేసింది..

ఎక్స్‌లోని గ్రోక్‌ ఏఐ చాట్‌బాట్‌ సృష్టించిన అసభ్య, అశ్లీల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని తీసుకున్న చర్యలపై 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ జనవరి 2న ఎక్స్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసభ్య కంటెంట్‌ అంశంలో తగిన చర్యలు తీసుకోని ఎక్స్‌.. తమ విధానాలను మారుస్తున్నామని కేంద్రానికి బదులిచ్చింది. సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపేలా ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ కేంద్రం గురువారం రెండో సారి నోటీసులు జారీ చేసింది. ఎక్స్‌ తగిన రీతిలో స్పందించకపోతే చట్టప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటీ శాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే గ్రోక్‌ ఏఐ చాట్‌బాట్‌ సృష్టించిన అసభ్య, అశ్లీల కంటెంట్‌పై ఎక్స్ దృష్టి సారించింది. ఇప్పటి వరకు 3,500 పోస్టులు, 600 అకౌంట్స్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై అసభ్య, అశ్లీల కంటెంట్‌ను అనుమతించబోమని, కంటెంట్ విషయంలో ప్రభుత్వ నియమాలను ఫాలో అవుతామని ఎక్స్ కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలిపింది. ఇక, ఇప్పటికే కేంద్రం ఎక్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేయకుండా గ్రోక్ టెక్నికల్, గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను రివ్యూ చేసుకోవాలని తెలిపింది. యూజర్ పాలసీలు చాలా కఠినంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమించే వారి అకౌంట్లు సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయాలని స్పష్టం చేసింది.

జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు…

జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు…

 

పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు.

– వంటల్లో పనస పొట్టు..పనస, పణ్ణాస అని సంస్కృతంలో పిలిచే పనసని హిందీవాళ్లు కటాహల్‌, చెక్కీ అంటారు. మనం పనస అనే పేరునే వాడుతున్నాం! పండు పనస, కూర పనస అని రెండు రకాలుగా పండుతుంది. కూర పనసకాయను తోలు వలిచి, లోపల కాయని సన్నని ముక్కలు కొట్టి కూర వండుకుంటారు. దీన్నే పనసపొట్టు అంటారు. వాతం, కఫం, వేడి, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధుల్ని తగ్గించి, జీర్ణశక్తిని కాపాడే మంచి ఔషధం పనసపొట్టు.

వేపుడు: పనసపొట్టును పసుపు, ఇంగువ, ధనియాలపొడి వేసిన నీళ్లలో ఉడికించి నీరు పిండిన తరువాత ముక్కల్ని చిన్నగా తరిగి, మిరియాలపొడి, జీలకర్ర, నెయ్యి వేసి దోరగా వేయిస్తారు. చివరగా పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు, నిమ్మముక్కలు, మొగలి రేకులు వంటి పరిమళద్రవ్యాలను స్వల్పంగా కలిపి, తెల్లని వస్త్రంలో మూటగట్టి కాగుతున్న నేతిలో ఉంచుతారు. ఇది నలుడు పాక దర్పణంలో చెప్పిన రాజభోజనంలో ముఖ్యమైన వంటకం. పోషకాల పుట్ట. రక్తపోటు, మధుమేహం, రక్తహీనతలను తగ్గిస్తుంది. వాత వ్యాధులతో బాధపడేవారికి మంచిది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version