కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ఆశ వర్కర్స్…

కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ఆశ వర్కర్స్

ఆశా వర్కర్స్ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించి 18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని అలాగే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్ మాట్లాడుతూ ఆశాలకు గతంలో ఇచ్చిన హామీల ప్రకారం 18 వేల రూపాయల పిక్సుడు వేతనం 50 లక్షల ఇన్సూరెన్స్ 50వేల మట్టి ఖర్చులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రసూతి సెలవులు పండగ సెలవులు నిర్ణయిస్తూ జీవోలను జారీ చేయాలని అన్నారు ఏఎంసీ పిఎంసి టార్గెట్లను రద్దు చేయాలి ఆశాల పిఆర్సి ఏరియాస్ లెప్రసీ సర్వే పల్స్ పోలియో ఎలక్షన్ డ్యూటీ తదితర పెండింగ్ డబ్బులను తక్షణమే చెల్లించాలని కోరారు ఆశాలతో ఎన్సిడి ఆన్లైన్ పని చేయించకూడదని అన్నారు ఆశాల తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కుమారి నాగ లత రజిత లలిత హైమావతి కవిత రాజేశ్వరి తదితర ఆశాలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version