కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కీర్తి నగర్ పి హెచ్ సి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాశిబుగ్గ నేటిధాత్రి

 

గీసుగొండ మండలం కీర్తి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది,ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతిరోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలను తనిఖీ చేసి మందుల గడువు తేదీలను పరిశీలించారు. పారాసెటమాల్ మందు అధికంగా ఉండడం పై ఫార్మసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవసరం మేరకే మందుల ఇండెంట్ తెప్పియాలన్నారు. ప్రతి మందు ఈ ఔషధం ప్రకారమే రోగులకు అందించాలన్నారు.ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని,స్క్రాప్ ను వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని సూచించారు.
కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, డీఈఓ జ్ఞానేశ్వర్, మెడికల్ ఆఫీసర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version