గుండంపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు…

గుండంపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు
మల్లాపూర్ మార్చి 12 నేటి దాత్రి

ప్రాథమిక పశు వైద్యశాల ముత్యంపేటకు చెందిన డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో గుండంపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గో జాతి పశువులు 10 మరియు గేదె జాతి పశువులు 121 కలిపి మొత్తం 131 పశువులకు టీకాలు వేయబడినవి.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ డప్పుల పద్మా నరసయ్య పశు వైద్య సిబ్బంది డాక్టర్ జి. అశోక్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఇక్బాల్ అలాగే పశు వైద్య సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
ఈ టీకా కార్యక్రమం ద్వారా గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించడానికి చర్యలు తీసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version