వర్షాకాల వ్యాధులను అరికట్టేందుకు జిల్లా.

వర్షాకాల వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్యాధికారి సమీక్ష

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్(MLHP) లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమీక్ష సమావేశంలో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నివారణ కార్యక్రమంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా జ్వరాల పై దోమలు పుట్టకుండా కు ట్ట కుండ పరిసరాల పరిశుభ్రత పై మరియు కేంద్ర ఆరోగ్య పథకాల లో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆరోగ్య శిబిరం ప్రగతి నివేదిక, డయేరియా నివారణ కార్యక్రమం రోజువారి నివేదిక, మాతా శిశు సంరక్షణ కార్యక్రమం సాధారణ ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీక్షించినారు.

 

Medical Officer Review.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ నహీం మరియు ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు.

జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు.

జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో విధులు
నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.

welfare

హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని,రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని,క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లగింస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, హోమ్ హార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లాలోని ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా ఎన్నికల అధికారి అండ్ కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాములో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అన్ని చర్యలు సక్రమంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈవీఎంల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు
అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు
ఈ తనిఖీలో ఎన్నికల విభాగం డిటి అబ్బాస్, ఐటి పర్సన్ నవీన్
రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ నుండి మునీందర్, సీపీఎం నుండి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు.

దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపించిందన్నారు. దీంతో రాష్ట్రంలోని 30 లక్షల రైతుల యొక్క 25వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అలాగే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినట్లుగా రాళ్ళకు, గుట్టలకు, వెంచర్లకు, రోడ్లకు కాకుండా పంటలు పండించే ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులతో మళ్లీ సర్వే చేయించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సన్న వడ్లు పండిస్తే క్వింటాల్ కు 500 చొప్పున బోనస్ చెల్లించడంలాంటి పథకాలతో రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం గర్వకారణమన్నారు. ఈ ఘనత దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందిన్నారు. సబ్సిడీలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే..బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని బొంద పెట్టి కేవలం వారి కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా సబ్సిడీ ట్రాక్టర్లను ఇచ్చి రైతులను మోసం చేసిందన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పథకాన్ని తీసుకురావాలనే ఆలోచన క్యాబినెట్ సమావేశంలో తీసుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ..అటు సంక్షేమం..ఇటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ..తెలంగాణ రైసింగ్ నెంబర్ 1 విజన్ 2047తో ముందుకు వెళుతుంటే ఇది ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు వారి స్థాయిని మరిచి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీపైన గానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గానీ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్

నర్సంపేట నేటిధాత్రి:

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.
జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్ ఇన్చార్జిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతినిత్యం విద్యార్థులకు సేవలు అందిస్తూ అవినీతిని అంతం చేస్తానని తెలియజేశారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి మహబూబాబాద్:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,ఆసుపత్రిలోని మెడికల్,ఫీవర్,క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్ , జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు.ఆలన కేంద్రం లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లు తదితరులతో మాట్లాడుతూ,వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ స్థితిగతులను తెలుసుకున్నారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అందుకు ప్రతినిత్యం కాంట్రాక్టర్లు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.రోగులకు నిత్యం వైద్య సేవలు అందిస్తూ షిఫ్టులవారీగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్.

తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా కో-ఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు.సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాస పథకంలో 20% శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు ప్రమాద బీమా ఐదు లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు ఎల్ల పోశెట్టి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం,బొడ్డు రాములు,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార.

అనాధ పిల్లలను పాఠశాలలో చేర్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు:-

వరంగల్/హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

వరంగల్ మరియు హన్మకొండ న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ఇరువురు అనాధ బాలురలను వివేకానగర్ లోని సాయి స్పందన పాఠశాలలో జాయిన్ చేశారు.గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామానికి చెందిన ఓని రమేష్, తిరుపతమ్మలకు  గౌతం వయస్సు 11 సంవత్సరాలు మరియు గర్విక్ వయస్సు 6 సంవత్సరాల కుమారులు కలరు. అనారోగ్య కారణాల వల్ల ఆరు నెలల క్రితం రమేష్ మరియు తిరుతమ్మలు మరణించడంతో  గౌతం మరియు గర్విక్ లు అనాదలైనారు. వీరు అనాథలుగా మిగిలిపోవడంతో  పెద్ద నానా అయిన ఓని విజయ్  వీరిని తనవద్ద ఉంచుకున్నాడు. తరువాత వీరిని పాఠశాలలో చేర్పించడానికి స్థోమత లేక పోవడం తో తేదీ:- 05- 06-2025 రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేశారు. వెంటనే  వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే గార్లు స్పందించి వారిని సాయి స్పందన పాఠశాలలో చేర్పించి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇట్టి కార్యక్రమం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో జరిగింది

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో “యోగ మహోత్సవం” ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి.నిర్మల గీతాంబ మరియు విశిష్ఠ అతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభా బృందం ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు ప్రదర్శించబడ్డాయి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ మాట్లాడుతూ – ‘‘యోగా మన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక అంశాలలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగా నిత్య ప్రక్రియ వల్ల మనం మన సాధారణ ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు.యోగా టీచర్లు శోభ మరియు భాస్కర్ యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించి, ఆరోగ్యపూరిత జీవనానికి యోగా అవసరమని స్పష్టం చేశారు.

ఈ యోగా కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, వరంగల్ హనుమకొండ జిల్లాలో ఇతర న్యాయమూర్తులు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ డి. రమా కాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాజరయ్యారు.

అనంతరం యోగా గురువులను న్యాయమూర్తులు మరియు వరంగల్ బార్ అసోసియేషన్ వారు శాలువాలతో సన్మానించారు.

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ.

ప్రచురణార్ధం
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
-రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
-ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:

 

తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్.

మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ హక్కుల సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు టి వెంకట్ రాములు తెలిపారు అధ్యక్షులుగా భీమనాథుని సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా క్యాతరాజు సతీష్ అస్లాం
జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్ గోలి లావణ్య.
జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి…

 

Election

 

జిల్లా కార్యవర్గ సభ్యులుగా
రమేష్ చారి,మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది
గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు
హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు
పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది
మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శివనగర్ అంగన్వాడీ (అండర్ బ్రిడ్జి )కేంద్రంలో కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పిల్లలు గర్భిణీల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా నాయకురాలు రావుల విజయ రాంచందర్, రాధిక,నాయకులు పట్టూరి సుధాకర్, తిరునగిరి వెంకన్న, తొగరు కృష్ణ, రాజు, శ్రీధర్, మధు, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు వాణిశ్రీ, ఉమాదేవి,నిర్మల,అనూష,ఇశ్రాల్ తదితరులు పాల్గొన్నారు.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలలను బ్రతికించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
గురువారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర జీవ సమాధి ఘట్టంచివరి రోజు నాటక ప్రదర్శనకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల నాటక ప్రదర్శనను చూసి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమే అని అన్నారు సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు,టీవీలు,సెల్ ఫోన్లు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం యొక్క గొప్పదనం దానిదేనని వివరించారు.గ్రామాలలో నాటక కళ ఆదరింపబడుతూ ఉందంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీపై ఉందని ఆయన సూచించారు. చిన్ననాడు తాను చూసిన నాటకాలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ గారు నాటకంలో పాల్గొన్న పాత్రధారుల అభినయాన్ని ప్రశంసిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించారు అంతేగాక నాటక సమాజం వారికి విరాళాన్ని అందజేశారు అనంతరం గ్రామస్తులు కళాబృందం వారు ఎస్పీ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎక్సైజ్ సీఐ,వెంకట్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కళాకారులు,ఇతర గ్రామాల నుండి వచ్చిన కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జిల్లాలో ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు
పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా ను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ నెల 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు
వానకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలు

జూన్ 18, 2025 నాటికి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వానకాలం – 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందుకోసం 143,99,06,145 రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, అందులో 114,50,67,074 రూపాయలు ఖజానా ద్వారా పంపిణీకి సంబంధించి నమోదయ్యారు. కాగా ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయి.
ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నజిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలో గల చిన్న బోనాల ,పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ఆరోగ్య ఉపకేంద్రములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డిఐఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రికార్డులను పరిశీలించి 0-5 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇచ్చిన తర్వాత రెండు గంటలు పాటు టీకాలు వేసిన ప్రాంతంలోనే అబ్జర్వేషన్ లో ఉంచుకొని మరో రెండు రోజులపాటు సంబంధిత ఏ.ఎ.న్ఎం మరియు ఆశ వర్కర్లు టీకాలు వేసిన పిల్లల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తూ, సకాలంలో విధులు నిర్వర్తించవలసిందిగా లేనియెడల సి.సి.ఏ. రూల్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నహీం జహన్ మరియు సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.

అయ్యా మా గోడు పట్టించుకోండి.

అయ్యా మా గోడు పట్టించుకోండి

మందమర్రి నేటి ధాత్రి

 

shine junior college

 

శ్రీయుత గౌరవనీయులైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికీ నమస్కరించి వ్రాయునది*

*గ్రామాలలో గుడుంబా నియంత్రించాలని కోరుతూ

విషయం మందమర్రి పట్టణ,మరియు మండలంలో ఉన్న గ్రామాలలో గుడుంబా మద్యం విచ్చలవిడిగా సరఫరా జరుగుతుంది గుడుంబా నిలుపుదల కొరకు

అయ్యా మా గ్రామం మందమర్రి మండలంలోని వెంకటాపుర్ గ్రామ పంచాయతీలో గుడుంబా క్రయవిక్రయాలు అతిగా జరుగుతున్నాయి దానితో రోడ్డున పడుతున్న కుటుంబాలు

గుడుంబా తాగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు

అంతేకాకుండా యువకులు ఈ గుడుంబాకీ బానిసలు అవుతున్నారు

గుడుంబా తాగి చిన్న వయసులో ప్రాణాలు పోతున్నాయి దానితో కుటుంబ పెద్దదిక్కు భర్తను కోల్పోపోవడం తో ఆ తల్లీ,పిల్లలు రోడ్డున పడుతున్నారు, అంతేకాకుండా ఆ పిల్లల పోషణ తల్లికి భారం అవుతుంది

గుడుంబా తయారీలో అనేక క్రిమిసంహారక,మత్తు పదార్థాలు యూరియా ,అత్యంత ప్రమాదకరమైనటువంటి మందులు వాడి ఈ గుడుంబా తయారు చేస్తున్నారు దానితో గుడుంబా తాగి శరీరంలోని కిడ్నీలు మరియు అవయవాలు పూర్తిస్థాయిలో పాడైపోయి ప్రాణాలు కోల్పోతున్నారు

గత ప్రభుత్వం గుడుంబా తయారీ దారుల మీద పిడియాక్ట్ కేసులు పెట్టడం జరిగింది ఆయన కూడా కొంతమంది ఇప్పుడు ఒక ముఠాగా ఏర్పడి గుడుంబాన్నీ గ్రామాలకి విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు దానితో గ్రామాలలో ప్రజలు యువకులు గుడుంబాకి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు

కావున వెంటనే ఈ గుడుంబా తయారు చేసి గ్రామాలకు సరఫరా చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు

సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )

shine junior college

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ, లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపినారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ పి ఓ ఎమ్ హెచ్ ఎన్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్.ఈ బాలయ్య పాల్గొన్నారు.

జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.

జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,రమేష్

కరీంనగర్ నేటిధాత్రి:

 

shine junior college

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టం మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్ మచ్చ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనకు కృషి చేయలేదు.మరోపక్క విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఏఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది.కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేషబోయిన రాము, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర

పరకాల నేటిధాత్రి

 

 

 

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు నాగేంద్రకు అభినందనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version