ఇంటర్ విద్యార్థి.. ఓమేష్ మృతదేహం లభ్యం.
కల్వకుర్తి /నేటి ధాత్రి.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో శివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన… ఓమేష్ కల్వకుర్తి మండలం జయ ప్రకాష్ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్నాడు. వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు పాఠశాల అనుమతి లేకుండా.. ఐదు మంది విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అందులో మున్ననూరు గ్రామానికి చెందిన ఓమేష్ స్నానం చేస్తుండగా ఈత రాకపోవడంతో.. కోనేరులో పడి గల్లంతయ్యాడు. బుధ, గురు వారాల్లో శ్రమించిన ఓమేష్ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడి ఆచూకీ కనుగొని భారీ క్రేన్ సహాయంతో బయటకి తీశారు. ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచనలు ఇచ్చారు. బాలుడి మృతదేహం లభ్యం కావడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రెండు రోజులపాటు నిరంతరాయంగా బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.