వనపర్తి లోప్లాస్టిక్ కవర్లు వాడవద్దు బట్టసంచులు.

వనపర్తి లోప్లాస్టిక్ కవర్లు వాడవద్దు బట్టసంచులు వాడాలని ప్రచారం చేసిన ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలోతిరుమలయ్య గుట్ట, దగ్గర. ప్లాస్టిక్ కవర్లలో టి వేడి ఇడ్లి సాంబార్ పార్సల్ చేయడం వల్ల క్యాన్సర్ ఇతర రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ని బట్ట సంచులు పేపర్ బ్యాగులు వాడాలని ఐక్య వేదిక ప్రచారం నిర్వహించామని ఐక్యవేదిక.అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు తిరుమలనాథ స్వామిని దర్శించుకున్నారు
ఈకార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తోపాటు యూత్ కాంగ్రెస్ నాయకులు పాండు సాగర్, గౌని కాడి యాదయ్య, నాగరాజు, రామస్వామి, శ్రీను, నిస్వార్థ ఫౌండేషన్ యువకులు తదితరులు పాల్గొన్నారు

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ పురపాలక కమిషనర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రత్యేక బృందాలతో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు, కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ పట్టుబడిన వారికి వెయ్యి రూపాయల నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న.!

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న మున్సిపల్ సిబ్బంది
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి పట్టణంలో తక్కువ మైక్రోన్ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు .ప్లా స్టిక్ కవర్లలో ఇడ్లీ సాంబార్ చాయి హోటల్ నిర్వాహకులు పార్శాల్ చేసి ఇవ్వడం వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాల విధిస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వనపర్తి పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు సుమన్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు కిరాణా షాప్ లో వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు నిర్వహించి ఇబ్బందుల గురి చేయడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు నోటీసులు ఇచ్చి తనిఖీలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు . ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం 120 మైక్రోన్ కవర్లు వాడాలని కిరాణా షాప్ ల వారిని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version