చేర్యాల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
పదవ వార్డు అభ్యర్థి మేడిశెట్టి ఉమా శ్రీధర్ గెలిపించాలి
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల మున్సిపల్ పరిధిలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన బిఆర్ఎస్ నాయకులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా పలు వార్డులలో తిరిగి ప్రచారం చేశారు10 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మేడిశెట్టి ఉమా-శ్రీధర్
ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు, తెలుసుకుని వాటి అమలుకు కచ్చితంగా కృషి చేస్తానని అభ్యర్థి మేడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రజలకు మాట ఇచ్చారు. గెలిచిన, ఓడిన ప్రజలలోనే, రాజకీయాలలోనే ఉన్నామని ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించామని, ఇక ముందు కూడా వార్డు సభ్యులకు ఏ సమస్య వచ్చినా దగ్గర ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో ప్రజలందరూ సహకరించిన ఒక ఓటుతో ఓడిపోయామని అదృష్టం వరించలేదని అన్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు..
మీ అందరి సహకారంతో చేరాలలోనే అగ్రగామిగా మన వార్డును చేర్చిదిద్దామని మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఔషర్ల కిషోర్ కాసుల శ్రీనివాస్ పచ్చిమడ్ల పరశురాం గుడాల శీను పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు
