మ్యాచ్‌లో గాయపడ్డ సాయి సుదర్శన్.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ
వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. అతడి గాయం తీవ్రమైనది కాదని బీసీసీఐ తాజాగా హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమిండియా క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని పేర్కొంది. రెండో రోజున విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన బంతిని సాయి సుదర్శన్ అద్భుత రీతిలో అందుకుని అతడిని పెవిలియన్ బాట పట్టించాడు. ఈ క్రమంలో చేతికి కాస్త పెద్ద దెబ్బతగలడంతో తట్టుకోలేకపోయిన అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో దేవదూత్ పడిక్కల్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన విషయం తెలిసిందే (Sai Sudarshan BCCI Health Update).
విండీస్‌తో తాజా చివరి టెస్టు మూడో రోజున కూడా సాయి సుదర్శన్ బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆరోగ్యంపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతడి గాయం తీవ్రమైనది కాదని తెలిపింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది. తమ మెడికల్ టీమ్ అతడి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఇక ప్రస్తుత టెస్టులో గడ్డు పరిస్థితిలో పడిపోయిన ఫాలో ఆన్ ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇక రెండో టెస్టు తొలి రోజున సాయి సుదర్శన్ ఆట తీరుతో జనాల విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. 87 పరుగులతో నిలకడైన ఆటతో రాణించాడు. అయితే, వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్ వేసిన బంతిలో బ్యాక్ ఫుట్ షాట్‌కు ప్రయత్నించి ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు.