ఎమ్మెల్యే జర్నలిస్టులకు బే షరతు గా క్షమాపణ చెప్పాలి
బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం జర్నలిస్టులను అవమానకరంగా మాట్లాడిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం మంత్రుల రాక సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జర్నలిస్టులను ఉద్దేశించి ఏం రాస్తారో రాసుకోండి అని ఏం పీకలేరని మాట్లాడడం దారుణం అన్నారు. జర్నలిస్టుల పట్లఅనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని బిజెపి మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.