MLA Inspects Maize Procurement Center in Kesamudram
ఎప్పటికప్పుడు కాంటాలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి
వ్యవసాయ మార్కెట్ మక్కల కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
కేసముద్రం/ నేటి ధాత్రి
మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ ముఖ్య మురళి నాయక్ పిఎసిఎస్ ధనసరి ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మార్కెట్ కమిటీ కేసముద్రం యందు పర్యటించినారు. వారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్ కి తీసుకొచ్చేటప్పుడు 14 శాతం లోపు తేమ ఉండేటట్లు చూసుకొని ఎటువంటి మట్టి పెల్లలు చెత్తాచెదారం లేకుండా రైతుల పంట క్షేత్రాలలోనే శుభ్రపరచుకొని , అధికారులు తెలిపిన తేదీ ప్రకారం వచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూపాయలు 2400 పొందాలని వారు సూచించారు, వారు అధికారులతో మాట్లాడుతూ రైతులకు మార్కెట్ యార్డ్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు కాంటాలు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని, కాంటాలు అయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేసి త్వరితగతిన మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని వారు సూచించారు. కొనుగోలు కేంద్రంలో కావలసినటువంటి గన్ని బ్యాగులు మాయిచ్చర్ మిషన్లు, టార్పాలిన్ సీట్లు, ఏర్పాటు చేయాలని రైతులకు మంచినీటి వసతి కలిగించాలని, కావలసిన లారీలు త్వరితగతిన తెప్పించి మొక్కజొన్న కొనుగోలను పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి,మార్కెట్ కమిటీ కార్యదర్శి అమరలింగేశ్వర రావు, సిఐ సత్యనారాయణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్రాంతి కిరణ్ , మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధనసరి సీఈవో గోపాల మల్లారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి కే రవివర్మ సెంటర్ ఇన్చార్జులు, మండల నాయకులు రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
