ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:
పెద్దపల్లి నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ఆరోగ్యం క్షీణించి అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్యం మెరుగుపడి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు అఖండమైన భారీ మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపొంది తెలంగాణ చట్టసభల్లో శాసన సభ్యురాలుగా అడుగు పెట్టాలని ఓదెల గ్రామంలోని పార్వతీ శంభు లింగేశ్వర ఆలయం లో అభిషేకం జరిపించారు.ఈ కార్యక్రమంలో ఓదెల మండల ఉపాధ్యక్షులు బోయ సదానందం ,మండల మహిళా కన్వీనర్ మేకల శోభ ,ఓదెల సెక్టార్ అధ్యక్షుడు బీరం రవి,6 వార్డ్ మెంబర్ రాచర్ల నిర్మల రాజేశం,మాజీ వార్డ్ మెంబర్ బుద్దే మహేష్,ముదిరాజ్ సంఘం డైరెక్టర్స్ తూడి రాజయ్య,తూడి ప్రవీణ్ , పెండం ఓదెలు,పసెట్ల స్వామి,ఓదెల విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ,మరియు పార్టీ కార్యకర్తలు తూడి సంధ్య,ఓల్లాల రజిని,నూతి రమాదేవి,పందెన దీపిక,కొండ్ర చర్మిల,చిలుముల శ్రీలత,గడ్డం సునీత, నూతి రాజేందర్,ఎంబడి రాజు,గాండ్ల శరత్, వంశీ,గడిగొప్పుల నవీన్,రామినేని కోటి, రామినేని స్వామి,అప్పని మధు,కొండ్ర సాగర్,కొండ్ర వెంకటేష్,రేగుల తిరుపతి,రేగుల రాజేందర్,కొండ్ర సంతోష్ తుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.