త్వరలో ఉపాద్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తాం.

# పిఆర్టీయు టీయస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి

# పిఆర్టీయు టీయస్ గీసుకొండ మండల సర్వసభ్య సమావేశం.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయవృత్తి విధానంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ వేదనం లేకపోవడం వల్లనే హక్కులు సాదించుకోలేకపోతున్నామని త్వరలో
సర్వీస్ రూల్స్ సాధిస్తామని పిఆర్టీయు టీయస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.వరంగల్ గీసుకొండ మండలంలోని ధర్మారం హైస్కూల్లో పీఆర్టీయు సర్వసభ్య సమావేశం జరిగింది.గీసుకొండ మండల శాఖ అధ్యక్షులు కల్లూరి వేంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తామని, మోడల్ స్కూల్ టీచర్స్ కు 010 పద్దు ద్వారా జీతాలు ఇప్పిస్తామని, కేజీబీవీ టీచర్స్ కు టైం స్కేల్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అన్ని యాజమాన్య ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని పేర్కొన్నారు.అలాగే పీజీ హెచ్ఎం PGHM ప్రమోషన్స్ ఇప్పిస్తామని, 2003 డిఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు అయ్యే విధంగా కృషి చేస్తామని శ్రీపాల్ రెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా కల్లూరి వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా మార్త శ్రీనివాస్,అసోసియేట్ అధ్యక్షులు గా బొల్లం రవి,ఎన్ ఇందిరా దేవి,ఉపాధ్యక్షులుగా ఎన్ మాలతి,ఏం. బలరాజు ,కార్యదర్శులుగా జి. పద్మజ మరియు ఎం స్వాతి ఎన్నికయ్యారు.ఎన్నికల పర్యవేక్షకులుగా సంగెం మండల అధ్యక్షులు,ప్రథాన కార్యదర్శి విజయ్,రాజేందర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఈదునూరీ రవీందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గఫార్,మాజీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సూరo శంకర్ రావు,తమ్మి దయాకర్ ,పత్రికా సంపాదక సభ్యులు రాజు,మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభి,నల్లబెల్లి మండల అధ్యక్షులు మహేందర్,దుగ్గొండి మండల మాజీ అధ్యక్షులు సుధాకర్,స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు రఘు,మండల ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *