₹10 Lakh Ex-Gratia Given to RTC Driver’s Family
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
నర్సంపేట, నేటిధాత్రి:
ఇటీవల ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు.ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో ఆర్డీవో ఉమారాణి, మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ ఛైర్మన్ గంధం నరేంద్ గుప్తా, ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి,మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యలు చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. శంకర్ గౌడ్ కుమారుడు కోల హేమంత్‌కు ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పించేందుకు ఎమ్మెల్యే ఆర్టీసీ ఎండీతో మాట్లాడారని, ప్రభుత్వానికి లేఖ పంపారని తెలిపారు. అతి త్వరలో కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.
ఈకార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ పొన్నాల మనిషా ప్రకాష్, ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండ రాజు గౌడ్, సామాజిక మాధ్యమ బాధ్యులు దేవోజు హేమంత్ పాల్గొన్నారు.
