Leakage Fixed After Media Report
నేటి ధాత్రి కథనానికి స్పందన
లీకేజ్ కి చెక్ పెట్టి – తాగు నీటి వృధా అరికట్టారు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీరు వృథాగా రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ‘నేటి ధాత్రి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి యంత్రాంగం వేగంగా స్పందించింది.గురువారం ఉదయమే రంగంలోకి దిగిన పంచాయతీ సిబ్బంది పాడైపోయిన కుళాయి స్థానంలో కొత్తగా ఆన్,ఆఫ్ చేసే ‘కీ’ అమర్చి మరమ్మతులు చేపట్టారు.పైపులైన్ నుంచి నీరు వృథా కాకుండా అరికట్టడంతో పాటు,నీరు నిల్వ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిసరాలను శుద్ధి చేసినట్లు పంచాయతీ కార్యదర్శి సురేష్ తెలిపారు.సమస్యను వెలుగులోకి తెచ్చి అధికారుల కళ్లు తెరిపించిన ‘నేటి ధాత్రి’ పత్రిక యాజమాన్యానికి,తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు ముదిగుంట గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
