బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాషింగ్టన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిషిధర్ రెడ్డి దొంగల రాజేందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లు ఉండడం వల్లే భారతదేశం అభివృద్ధి చెందడం లేదు అని అనడం రాహుల్ గాంధీ వ్యాక్యాలను వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ పక్కనే ఉన్న చైనా 4వేల కిలోమీటర్లు భారత్ ను ఆక్రమించిందని అనుచిత వాక్యాలు చేయడానికి కూడా తప్పుపడుతున్నాం బిజెపి పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది ఎస్సీ ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేస్తుందని తప్పుడు ప్రచారం చేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మలేదు మూడోసారి ప్రధాని మోడీని అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రజలు రాహుల్ గాంధీకి తప్పకుండా బుద్ధి చెప్తారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ బట్టు రవి బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు